*కేయూ స్పోర్ట్స్ బోర్డు సెక్రెటరీ వెంకయ్య*
*”నేటిధాత్రి” హనుమకొండ*
సౌత్ జోన్ యూనివర్సిటీ లాన్ టెన్నిస్ పోటీల్లో రాణించి కాకతీయ యూనివర్సిటీకి పేరు తీసుకురావాలని కేయూ స్పోర్ట్స్ బోర్డు సెక్రెటరీ డాక్టర్ వై.వెంకయ్య అన్నారు. మంగళవారం కిట్స్ ఇంజనీరింగ్ కాలేజీలో అంతర్ కళాశాల కళాశాలల లాన్ టెన్నిస్ సెలక్షన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని వై వెంకయ్య మాట్లాడుతూ కాకతీయ యూనివర్సిటీ ఔత్సాహిక క్రీడాకారులు ప్రోత్సహిస్తుందని తెలిపారు. కాకతీయ యూనివర్సిటీ ఫిజికల్ డైరెక్టర్ అసోసియేషన్ అధ్యక్షుడు, కిట్స్ కళాశాల అడ్మినిస్ట్రేటర్ డాక్టర్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ యూనివర్సిటీ నుంచి పలువురు క్రీడాకారులు జాతీయ, సౌత్ జోన్, ఆల్ ఇండియా యూనివర్సిటీ పోటీల్లో రాణించారని తెలిపారు. ప్రతిభగల క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నామని గుర్తు చేశారు. కిట్స్ కళాశాల స్పోర్ట్స్ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఈ లాన్ టెన్నిస్ పోటీలకు అద్భుత స్పందన ఉందని తెలిపారు. కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని వివిధ కళాశాలల పురుషుల, మహిళల విభాగంలో నుంచి దాదాపు 50 మంది క్రీడాకారులు పాల్గొన్నారని తెలిపారు. ఇందులో ప్రతిభ చూపిన క్రీడాకారులను ఎంపిక చేసి సౌత్ జోన్ పోటీలకు పంపుతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో అబ్జర్వర్లు వెంకటస్వామి, అఫ్జల్, కిషన్, పవన్, ఫిజికల్ డైరెక్టర్లు ప్రభాకర్ గౌడ్, కుమార్, శ్రీధర్, పెరుమాండ్ల వెంకట్ తదితరులు పాల్గొన్నారు.