భద్రాచలం నేటి దాత్రి
టి ఎన్జీవోస్ ప్రెసిడెంట్ మరియు సెక్రటరీ డెక్కా నరసింహ రావు, గగ్గురి బాలకృష్ణ వారి ఆధ్వర్యంలో స్థానిక భద్రాచలం రవాణా శాఖ కార్యాలయం నందు ఆర్టీవో గా బాధ్యతలు స్వీకరిస్తున్న సంఘం వెంకట్ పుల్లయ్య కి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేసినారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భద్రాచలంలో పెరుగుతున్న రవాణా ట్రాఫిక్ దృష్ట్యా ప్రతి ఒక్కరు కూడా రోడ్డు భద్రత నియమాలు పాటించి సక్రమంగా వారి గమ్యస్థానాలు చేరాలని కోరుకుంటూ ఆ విధంగా నడిపించుటకు నిత్యం కృషి చేసే వ్యక్తుల్లో ఆర్టీవో వెంకట పుల్లయ్య ఒకరిని తెలియజేశారు. ఈ సందర్భంగా అధికారి మాట్లాడుతూ తన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తూ అటు ప్రజలకి ఇటు ఉద్యోగస్తులకి అందుబాటులో ఉంటానని తెలుపుతూ టీ ఎన్జీవోస్ భద్రాచలం వారికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ట్రెజరర్ పడిన నరసింహారావు గాంధీ శ్రీనివాస్ అంజిబాబు హరి సత్యనారాయణ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.