నెక్కొండ, నేటి ధాత్రి:
మండలకేంద్రంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో సర్వాయి గౌడ సంఘం టౌన్ ప్రెసిడెంట్ పలుసం రాజేందర్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహిచారు.ఈ సందర్భంగా వీరాస్వామి గౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వాలు మారినా గీతకార్మికుల బతుకులు మారలేదని అన్నారు.సేఫ్టీ మోకులు ఇస్తున్న ప్రభుత్వం కంటితుడుపు చర్యగా లక్షల్లో గీతకార్మికులు ఉండగా వేలల్లో కేటాయించడం విచారకరం.ప్రభుత్వానికి చిత్తుద్ధి ఉంటే 250కోట్లు ఒకేసారి కేటాయిస్తే అందరికీ లబ్ధి చేకూరుతుందని అన్నారు.బీసీ కులగణన పారదర్శకంగా నిర్వహించి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు.సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ సూర్తిగా బహుజనులందరు ఐక్యంగా పోరాడి రాజ్యాధికారం కోసం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి గడ్డం.శ్రీనివాస్ గౌడ్, కొయ్యడి.ప్రశాంత్ గౌడ్,జిల్లా అధ్యక్షుడు కక్కేర్ల.నాగయ్య గౌడ్,
ఉపాధ్యక్షుడు ఎలికట్టె.శ్రీనివాస్ గౌడ్,యూత్ అధ్యక్షుడు కల్లెపు.గణేష్ గౌడ్,జిల్లా మహిళ అధ్యక్షురాలు కక్కర్ల రాధిక,నాయకులు కారింగుల సురేష్ గౌడ్, అంబాల రాంగోపాల్ గౌడ్,రాజు,కుమార్,అనిల్ తదితరులు పాల్గొన్నారు.