# భాజపా జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్
# 3 వ వార్డ్ వల్లభ్ నగర్ లో సభ్యత్వ నమోదు కార్యక్రమం.
తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయడమే సంకల్పంగా బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టినట్లు భాజపా వరంగల్ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ తెలిపారు.బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా నర్సంపేట పట్టణంలోని 3 వ వార్డ్ వల్లభ్ నగర్ లో నిర్వహించిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులతో కలిసి వరంగల్ జిల్లా బిజెపి అధ్యక్షులు గంట రవికుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి రాణా ప్రతాప్ రెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో భాజపా ప్రభుత్వ హాయంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశ పెట్టిన పథకాల వలన తెలంగాణా అభివృద్ధి
చెందుతున్నదని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పార్లమెంట్ కో కన్వీనర్ కట్ల రామచంద్ర రెడ్డి,ఎస్టి మోర్చ జిల్లా అధ్యక్షులు బానోత్ వీరన్న,నర్సంపేట రూరల్ మండల అధ్యక్షులు గంగిడి మహేందర్ రెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శులు కొంపల్లి రాజు,గూడూరు సందీప్, బిజెవైఎం పట్టణ అధ్యక్షులు తప్పేట్ల సతీష్, ఎస్సీ మోర్చా పట్టణ అధ్యక్షులు కేశపాక బాబు తదితరులు పాల్గొన్నారు.