
పంబాపూర్ భీమ్ ఘనపూర్ పెద్దచెరువులో ఉచిత చేపపిల్లలను వొదిలిన ఎమ్మెల్యే జీఎస్సార్
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి మండలం
మత్స్యకారుల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తున్ననట్లు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. గురువారం భూపాలపల్లి నియోజకవర్గం భూపాలపల్లి రూరల్ మండలంలోని పంబాపూర్ భీమ్ ఘనపూర్ పెద్దచెరువులో జయశంకర్ భూపాలపల్లి జిల్లా మత్స్య శాఖ ఆధ్వర్యంలో ఉచిత చేప పిల్లలను వొదిలే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, రాష్ట్ర డిప్యూటీ డైరెక్టర్ ఖదీర్ అహ్మద్, జిల్లా ఫిషరీస్ డెవలప్ మెంట్ ఆఫీసర్ అవినాష్ కాంగ్రెస్ ముఖ్య నేతలతో కలసి చేప పిల్లలు వదిలారు. ఈ సందర్భంగా అక్కడ చెరువు కట్టపై ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం మత్యకారుల ఆర్థికాభివృద్ధికి నూరు శాతం రాయితీపై ఉచిత చేప పిల్లలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగానే ఈరోజు పంబా పూర్ భీమ్ ఘనపూర్ పెద్ద చెరువులో సుమారు 50 వేల చేప పిల్లలను వొదిలామని, వారంలోపు మరో 6 లక్షల చేప పిల్లలను వొదులుతామని ఎమ్మెల్యే తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మత్యకారుల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని అన్నారు. ఉచిత చేప పిల్లలు పంపిణీ ద్వారా మత్యకారులకు ఆదాయ వనరులను మెరుగుపరుచుకోవడంతో పాటు జలాశయాలల్లో చేపల ఉత్పత్తిని పెంచేందుకు దోహదపడుతుందని అన్నారు. చెరువే మన జీవనాధారమని గత ప్రభుత్వ హయాంలో చెరువులు అన్ని అన్యాక్రాంతం అయ్యాయని, నీళ్ళు వెళ్లకుండా పూడ్చి వేశారని తమ ప్రభుత్వం చెరువుల పరిరక్షణకు చర్యలు చేడుతుంటే అడ్డుపడుతున్నారని అన్నారు. చెరువులను కాపాడుకోపోతే భవిష్యత్తు తరాలకు అన్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు. నీలి విప్లవం రావాలని తద్వారా మత్స్యకారులు అభివృద్ధి జరగాలని అన్నారు. చెరువు ఎగువనున్న పంట పొలాల నుండి మందులు చల్లిన నీరు చెరువుల్లో చేరడం వల్ల చేపలకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని అట్టి నీళ్ళు చెరువుల్లో కలవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. చెరువుల ద్వారా చేపల పెంపకంతో పాటు వ్యవసాయం జరుగుతుందన్నారు. గత ప్రభుత్వ హయాంలో గొర్రెలు, చేపలు పథకాలలో అవినీతికి పాల్పడినట్లు తెలిపారు. ప్రజా ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలులో చిత్తశుద్ధితో పనిచేస్తున్నట్లు తెలిపారు. మత్స్యకారులు అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నాణ్యత కలిగిన చేప పిల్లలు వేస్తున్నామని అన్నారు. అవినీతికి పాల్పడితే సహించమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రామచంద్రయ్య కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీను కొమురయ్య రంజిత్ విజయ్ పాల్గొన్నారు