
డిప్యూటీ తహసిల్దార్ ఎండి నిజాముద్దీన్
వీణవంక ,(కరీంనగర్ జిల్లా):
నేటి ధాత్రి:వీణవంక మండల పరిధిలోని బొంతుపల్లి గ్రామంలో పల్లెమీద పైప్ లైన్ పనికి జడ్పీ నిధులు మూడు లక్షలు మంజూరు అవగా, బొంతుపల్లి మాజీ ఎంపిటిసి చదువు – నరసింహ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామ ప్రత్యేక అధికారి డిప్యూటీ తహసిల్దార్ ఎండి నిజముద్దీన్ పనులు ప్రారంభించారు.ఈ సందర్బంగా మాజీ ఉప సర్పంచ్ చదువు జితేందర్ రెడ్డి మాట్లడుతూ…జడ్ పి నుండి నిధులు మంజూరు చేంచి నందుకు ప్రస్తుత శాసనసభ్యులు, అప్పటి ప్రభుత్వవిప్ అయిన పాడి కౌశిక్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు.ఈకార్యక్రమంలో కార్యదర్శి కె.రజిత,తాజా మాజీ ఉప సర్పంచ్ బావు సంపత్,మాజీ సర్పంచ్ రాజ్ కుమార్ పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు.