మహిళలకు 2500 రూపాయలు ఇస్తానని మాట తప్పిన కాంగ్రెస్
బిఆర్ఎస్ పట్టణ మహిళ అధ్యక్షురాలు గంటా కళావతి
పరకాల నేటిధాత్రి
ఇచ్చిన హామీలు మరిచిపోయి అబద్ధాలే అస్త్రాలుగా తెలంగాణ ప్రజలను మోసగించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నదని అధికారంలోకి వచ్చిన తర్వాత 18 ఏండ్లు నిండిన మహిళలకు 2500 రూపాయలు చెల్లిస్తున్నామని,కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామంటూ ఆచరణ సాధ్యం కాని హామీని ఇచ్చి మరోసారి మహిళలను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని,ఆసరా పింఛనును ఇంతవరకు 4 వేలకు పెంచలేదని,డబ్బు ఇచ్చే పథకాలను అమలు చేయడం లేదని,ఉద్దెర బేరం పథకాలను అమలు చేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు మహిళల సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేశారని గుర్తుచేశారు.మహిళలు ఇప్పటికైనా ప్రభుత్వం చేస్తున్న మోసాలను గ్రహించాలని, రాబోయే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలని బిఆర్ఎస్ పట్టణ మహిళ అధ్యక్షురాలు గంటా కళావతి అన్నారు.