బ్రహ్మోత్సవాల్లో లడ్డు తయారీలో అన్యమతస్తుల ప్రమేయం లేదు

– లడ్డు,పులిహోర తయారీ దేవస్థాన ఆవరణలోనే జరిగింది

– తామంతా సనాతన ధర్మాన్ని పాటించే వాళ్లమే

– సిరిసిల్ల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం మాజీ చైర్మన్లు

సిరిసిల్ల(నేటి ధాత్రి):

సిరిసిల్లలో జరిగిన బ్రహ్మోత్సవాల్లో లడ్డు తయారీలో అన్యమతస్తులు ప్రమేయం లేదని, హిందువుల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని దగ్గరుండి లడ్డులను తయారు చేయించామని సిరిసిల్ల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం మాజీ చైర్మన్లు ఉప్పల విట్టల్ రెడ్డి, తీగల శేఖర్ గౌడ్, చేపూరి నాగరాజు తెలిపారు.
ఈరోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్బు లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా తాము దేవస్థానం చైర్మన్గా పనిచేస్తూ బ్రహ్మోత్సవాలను విజయవంతం చేస్తున్నామని తెలిపారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా లడ్డు టెండర్ హిందువు అయినా పులి మల్లేశంకు అప్పగించినట్లు తెలిపారు. లడ్డు మరియు పులిహోర తయారీ కూడా దేవస్థాన ఆవరణలోనే జరిగిందని ఇందులో అన్యమతస్తుల ప్రమేయం ఏమీ లేదని తెలిపారు. లడ్డు పులిహోర అమ్మకాలప్పుడు స్కానర్ వాడకంలో ముస్లిం వచ్చిందని భక్తుల నుండి ఫిర్యాదు రాగానే వెంటనే స్కాన్ అండ్ తొలగించామని తెలిపారు. ఎక్కడ కూడా హిందువుల మనోభావాలు దెబ్బ తీయలేదని, తామంతా సనాతన ధర్మాన్ని పాటించే వాళ్లమేనని వారు స్పష్టం చేశారు. రాజకీయ లబ్ధి కోసం కొందరు కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *