భూపాలపల్లి నేటిధాత్రి
తెలంగాణ ముదిరాజ్ మహాసభ జయశంకర్ జిల్లా భూపాలపల్లి యూత్ ఉపాధ్యక్షుడిగా జోడు ప్రదీప్ ముదిరాజ్ ను నియమిస్తూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముదిరాజ్,రాష్ట్ర ముదిరాజ్ మహాసభ యువత విభాగం అధ్యక్షులు పండుగ బాలు ముదిరాజ్ నియామక పత్రం అందజేశారు. జిల్లా ముదిరాజ్ మహాసభ అధ్యక్షుడు జోరుక సదయ్య ముదిరాజ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లెబోయిన అశోక్ ముదిరాజ్ హాజరయ్యారు. ముదిరాజ్ మహాసభ జిల్లా ఉపాధ్యక్షుడిగా జోడు ప్రదీప్ ముదిరాజ్ ను నియమించినట్లు ఆయన తెలిపారు ఈ సందర్భంగా ప్రదీప్ ముదిరాజ్ మాట్లాడుతూ తనమీద నమ్మకంతో జిల్లా ఉపాధ్యక్షుడిగా నియమించిన తెలంగాణ ముదిరాజ్ మహాసభ అధ్యక్షులు డాక్టర్ బండా ప్రకాష్ ముదిరాజ్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తనపై నమ్మకం ఉంది అప్పజెప్పిన ఈ బాధ్యతలను పూర్తిగా న్యాయం చేస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షులు జోరుకా సదయ్య ముదిరాజ్, జిల్లా ఉపాధ్యక్షుడు చాడ కిష్ట స్వామి ముదిరాజ్ మత్స్య శాఖ జిల్లా చీఫ్ ప్రమోటర్ చేలుకల పాణి ముదిరాజ్ మహాసభ జిల్లా ప్రధాన కార్యదర్శి వేముల రాజమౌళి ఉపాధ్యక్షులు జోడు శ్రీను,సాద మల్లయ్య గణపురం మండల అధ్యక్షులు బోయిని సాంబయ్య ముదిరాజ్ జిల్లా యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ దార్ల ఆనంద్ జిల్లా యూత్ అధ్యక్షులు మారబోయిన ధనుంజయ్ ప్రధాన కార్యదర్శి పిట్టల కేశవులు తదితరులు పాల్గొన్నారు.