# నర్సంపేటలో ఓంకార్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించిన నాయకులు.
నర్సంపేట,నేటిధాత్రి :
అసెంబ్లీ టైగర్,ఎంసిపిఐ(యు ) వ్యవస్థాపకులు కామ్రేడ్ మద్దికాయల ఓంకార్ 16వ వర్ధంతి పక్షోత్సవాల సందర్భంగా మచ్చాపురం స్థూపం వద్ద జరిగే వర్ధంతి సందర్భంగా నర్సంపేట నుండి ఆ పార్టీ శ్రేణులు కదిలివెళ్లారు.ముందుగా నర్సంపేట అంగడి సెంటర్ లిని ఓంకార్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.
అనంతరం ఎంసిపిఐ(యు)రాష్ట్ర కమిటీ సభ్యురాలు వంగాల రాగసుధ మాట్లాడుతూ నైజాం రజాకర్లు ,భూస్వామ్య శక్తుల ఆగడాలపై ఓంకార్ మడమ తిప్పని పోరాటం చేశారని ,భూస్వాముల భూములను పేద ప్రజలకు పంచడంలో ప్రముఖ పాత్ర పోషించారన్నారు. శ్రామికవర్గ ఐక్య పోరాటాల బలోపేతానికి మార్క్సిజమే మార్గ దిశగా తరతరాలుగా అసమానతలతో అణిగి ఉన్న సమాజాన్ని అంబేద్కర్ ఆలోచన విధానంతో నిర్మూలించే దిశగా రాజకీయ ,ఆర్థిక , సామాజిక సమానత్వాన్ని బహుజనులకు రాజ్యాధికారం కాంక్షిస్తూ , జరిగే ఓంకార్ 16వ వర్ధంతి సభలను విజయవంతం చేస్తూ , ఆయన ఆశయ సాధనకు పునరంకిత అవుతామన్నారు.ఈ కార్యక్రమంలో ఎంసిపిఐ(యు) డివిజన్ సహాయ కార్యదర్శి కొత్తకొండ రాజమౌళి,ఏఐసిటియు జిల్లా అధ్యక్షులు ఎండి మాషూక్,డివిజన్ నాయకులు కర్నె సాంబయ్య,ఆకుల రాజేందర్,విమల,బెల్లంపల్లి భారతి, జయ పద్మ,సాంబలక్ష్మి,సమ్మక్క, గణిపాక బిందు తదితరులు పాల్గొన్నారు.