ఒకనాడు ప్రభుత్వ స్థలం.నేడు భవంతి వెలిసి ప్రారంభోత్సవానికి సిద్ధం
పట్టించుకోని పంచాయితీ రెవెన్యూ అధికారులు
ప్రభుత్వ స్థలాలలో ఎవరైనా కట్టుకోవచ్చా అని ప్రజల అభిప్రాయం
భద్రాద్రి, కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి
చుంచుపల్లి మండలం ప్రశాంత్ నగర్ గ్రామపంచాయతీ పరిధిలో గత మూడు సంవత్సరముల క్రితం మెయిన్ రోడ్డు ప్రక్కన బెతనియ చర్చి ప్రక్కన ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణం మొదలుపెట్టారు. ఆనాడు పంచాయతీ రెవెన్యూ అధికారులు స్పందించి అక్కడ ఇది ప్రభుత్వ స్థలమని బోర్డు పెట్టడం జరిగింది. ఎట్టకేలకు బోర్డుని తీసివేసి నిర్మాణం మాత్రం వేగవంతంగా పూర్తి చేశారు అక్రమ కబ్జాదారులు.ఆనాటి నుండి దానిలోకి ఎవరు రాలేని పరిస్థితి. ఎందుకంటే అది అక్రమ నిర్మాణం ప్రభుత్వ స్థలంలో కట్టారు దానికి ఎటువంటి అనుమతులు లేవు కాబట్టి నేటి వరకు దానిలోకి కిరాయికి కూడా ఎవరు రాని పరిస్థితి ఉండేది. మరి ఏమి జరిగిందో ఏమో కానీ నేడు ఆ భవంతి ప్రారంభోత్సవానికి సిద్ధమవుతుంది. కరెంటు ఎలా వచ్చిందో దానికి ఒకవేళ హౌస్ టాక్స్ ఉంటే అది ఎలా వచ్చి ఉంటుంది. అప్పుడు ప్రభుత్వ స్థలము అయినప్పుడు ఇప్పుడు ఎలా వారి సొంతమవుతుంది అనుకుంటున్న ప్రజలు. చిన్న ప్రభుత్వ స్థలంలో ఎవరైనా నిరుపేదలు వేసుకుంటే ఆగమేఘాలమీద వచ్చి హడావిడి చేసే అధికారులు నేడు నేషనల్ హైవే రోడ్డు ఆనుకొని ఎంతో విలువైన స్థలం కబ్జా చేసి భవంతిని నిర్మించి దానిలోకి ప్రవేశిస్తున్నప్పటికీ అధికారులు అడ్డు చెప్పకపోవడం ఏంటో అర్థం కాని పరిస్థితి. అప్పుడు దానికి ఏమీ లేక ఆనాటి యంగ్ డైనమిక్ సెక్రటరీ ఎటువంటి అనుమతులు వారికి ఇవ్వలేదు మరి ఇప్పుడు ఏమైనా వారికి స్పెషల్ గా ప్రభుత్వ స్థలంలో కట్టుకున్నారు కదా అని ఏమైనా అనుమతులు ఇచ్చారా తెలియాల్సి ఉంది మరి ఇలా ప్రభుత్వ స్థలాలు ఎవరికి వచ్చినట్టు నచ్చినట్టు వారు కట్టుకుంటే పర్వాలేదా ఉన్నవారు కట్టుకుంటే అధికారులు ఏమనరా..లేక ఎవరైనా ప్రభుత్వ స్థలాలలో కట్టుకోవచ్చా అధికారులు తెలియజేస్తే బావుంటది అంటున్న ప్రజలు. ఏది ఏమైనా అప్పటికి ఆ స్థలం ప్రభుత్వ స్థలం అని పంచాయతీ అధికారులకు రెవెన్యూ అధికారులకు అందరికీ తెలుసు. ఈ ప్రజా పాలనలో