గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి :
గుండాల వాసవి క్లబ్ గ్రీన్ ఫీల్డ్, ఆర్యవైశ్య సంగం ఆధ్వర్యంలో ఎంబిబిఎస్ లో సీట్ సాధించిన ఇద్దరు విద్యార్థిలకు ఘనంగా సన్మానం చేశారు.ఎంబిబిఎస్ లో సీట్ సాధించిన సాయినపల్లి గ్రామానికి చెందిన ఇర్ఫా నాగేశ్వరరావు ,సుశీల కుమార్తెలు ఇర్ప అమృతరాణి , ఇరుప బేబీ ప్రసన్న ఎంబిబిఎస్ లో ఫ్రీ సీట్ సాధించడంతో వాసవి క్లబ్ మండల అధ్యక్షుడు ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో మానాల నారాయణమూర్తి ,మానాల ప్రణీత్, నాగరాజు ,రాంబాబు ,అయితా శ్రీశైలం, అయిత పూజిత్ ఐత నాగమల్లయ్య, తాటికొండ వీరన్న, పాలడుగు భరత్ ,శ్రీరంగం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.