#వ్యక్తిపై కేసు నమోదు.. టౌన్ సీఐ రమణమూర్తి.
నర్సంపేట,నేటిధాత్రి :
నర్సంపేట పట్టణంలోని బస్టాండు సమీపంలో నిషేధిత ఆంబార్ ప్యాకెట్లను అమ్ముతున్న కీరాణం దుకాణంపై సీఐ రమణామూర్తి, ఎస్సై రవితో కలిసి చేశారు ఈ సంఘటన బుదవారం మధ్యాన్నం చోటుచేసుకున్నది.అంబర్ ప్యాకెట్లను స్వాదీనం చేసుకొని వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు నర్సంపేట టౌన్ సీఐ రమణమూర్తి తెలిపారు.ఈ సందర్భంగా సీఐ తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని బస్టాండు సమీపంలో మనోహర్ కిరాణం దుకాణంలో అక్రమంగా నిషేధిత అంబార్ ప్యాకెట్లను నిల్వ ఉంచి అమ్మకాలు చేపడుతున్నారని సమాచారంతో తనిఖీ చేయగా అంబర్ ప్యాకెట్లు దొరికాయని తెలిపారు.స్వాదీనం చేసుకున్న అంబర్ ప్యాకెట్లు విలువ సుమారు 10700 రూపాయలు ఉంటుందని అన్నారు.మనోహర్ కిరాణం యజమానిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు సీఐ రమణామూర్తి తెలిపారు.ఈ దాడిలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.