ప్రభుత్వం చొరవ తీసుకొని శాలివాహన పవర్ ప్లాంట్ తెరిపించాలి

మంచిర్యాల నేటి దాత్రి

ఈరోజు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని పాత మంచిర్యాలలో గల శాలివాహన బయోమాస్ పవర్ ప్లాంట్ ను ప్రారంభించేల ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కంపెనీ ఆవరణలో కార్మికులు నిరసన చేయడం జరిగింది, అదేవిధంగా కార్మిక సంఘం అధ్యక్షులు కుంటాల శంకర్ మాట్లాడుతూ గత 20 నెలలుగా పవర్ పర్చేస్ అగ్రిమెంట్ ( పి.పి.ఏ) ముగిసిందని కంపెనీని మూసి వేయడం జరిగింది ఈ యొక్క పవర్ ప్లాంట్ ను తెరిపించాలని ఇదివరకే జిల్లా కలెక్టర్ కి మరియు స్థానిక శాసనసభ్యులు కు పలు మార్లు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో మంచిర్యాల జిల్లాలో ఇండస్ట్రియల్ కారిడార్ మరియు ఐడి హబ్ ఏర్పాటు కోసం హాజీపూర్ మండలంలో సుమారుగా 300 ఎకరాల భూములను కూడా  సేకరించామని పరిశ్రమలు స్థాపించే వాళ్ళు ముందుకు రావాలని ప్రభుత్వం ద్వారా అన్ని విధాల సహకరిస్తామని స్థానిక శాసనసభ్యులు మరియు జిల్లా కలెక్టర్ మీడియా ద్వారా ప్రకటించడం అడిగింది కేవలం శాలివాహన పవర్ ప్లాంట్ నకు పవర్ పర్చేస్ అగ్రిమెంట్ ఇప్పించినచో ప్రభుత్వం నుండి ఎలాంటి పెట్టుబడును ఆశించకుండా కంపెనీలో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించడం జరుగుతుంది, దీనివల్ల సుమారుగా 300 మంది కార్మికులకు జీవనోపాధి దొరుకుతుందని ప్రభుత్వానికి విన్నపిస్తున్నాము వెంటనే స్థానిక శాసనసభ్యులు మరియు జిల్లా కలెక్టర్ స్పందించి ప్రభుత్వం ద్వారా కంపెనీకి పవర్ పర్చేస్ అగ్రిమెంటు ఇప్పించే విధంగా కృషి చేసి 300 మంది కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని కోరుచున్నాము ఈ కార్యక్రమంలో పవర్ ప్లాంట్ కార్మిక సంఘం అధ్యక్షులు కుంటాల శంకర్ మాజీ అధ్యక్షులు చెట్టి శ్రీనివాస్ ఉపాధ్యక్షులు కాయితి శ్రీనివాస్ పెంట సత్యం ఊడెం రవిశంకర్ ఆసరి రాజయ్య ఎస్ తిరుపతి మానెం శ్రీశైలం బొలిశెట్టి తిరుపతి ఆసరి పోషం, మరియు కార్మికులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *