చెరువులో చేప పిల్లలను వదిలిన ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి …
మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
నసుల్లాబాద్ పెద్ద చెరువును మినీ ట్యాంక్ బండ్ గా తయారు చేస్తానని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి బుధవారం అన్నారు.. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం నస్రుల్లాబాద్ గ్రామంలోని పెద్ద చెరువు దగ్గర మత్సశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చేప పిల్లల పంపిణీ కార్యక్రమానికి బుధవారం జడ్చర్ల శాసనసభ్యులు జనంపల్లి అనిరుధ్ రెడ్డి, ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
గ్రామంలోని పెద్ద చెరువులోకి చేప పిల్లలను వదిలారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…
పెద్ద చెరువు అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తానని అన్నారు. త్వరలోనే పెద్ద చెరువు ను మినీ ట్యాంక్ బండ్ గా తయారు చేసేందుకు నా వంతు ప్రయత్నం చేస్తానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బాదేపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ తంగేళ్ల జ్యోతి అల్వాల్ రెడ్డి, వైస్ చైర్మన్ రాజు గౌడ్,కాంగ్రెస్ పార్టీ నాయకులు,మత్స్యకారులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.