
@దసరా పండుగ సందర్భంగా సామాన్యుని జేబు చిల్లు.
@వైన్స్, బెల్ట్ షాపుల కుమ్మక్కుతో ప్రజల ఇబ్బందులు.
@ప్రతి ఒక్క బాటిల్ పైన 40 నుంచేలి 90 రూపాయల వసూళ్లు.
@ఇంత జరుగుతున్న కన్నెత్తి చూడని ఎక్సైజ్ శాఖ.
@రెండు ప్రధాన రహదారులపై వాహనదారుల ఇబ్బందులు.
నెక్కొండ, నేటిధాత్రి:
మండలంలోని వైన్స్ బెల్ట్ షాపుల దందా రోజురోజుకు మూడు పువ్వులు ఆరు కాయలుగా నడుస్తుంది. మండలంలో నాలుగు షాపులు ఉండగా ఒక్కొక్క షాపు ఏడు గ్రామాలు గా పంచుకొని బెల్ట్ షాప్ ల నిర్వాహకులతో దందాలను కొనసాగిస్తున్నారు. ఒక్కొక్క గ్రామానికి 10 నుంచి 15 బెల్ట్ షాపులు ఉండగా మండల వ్యాప్తంగా 800 బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారు. ఒక్కొక్క బాటిల్ పైన వైన్స్ నిర్వాహకులు 20 రూపాయలు ఎక్కువ తీసుకోగా బెల్ట్ షాప్ నిర్వాహకులు మరో 20 జోడించి ఒక క్వాటర్ పైన 40 రూపాయల చొప్పున వసూలు చేస్తూ దోచినోడికి దోచినంత అనే సామెత ను నెక్కొండ బెల్ట్ షాప్ ,వైన్ షాపుల నిర్వాహకులు నిరూపిస్తున్నారు. తెలంగాణలో అతి పెద్ద పండుగ అయిన దసరా పండుగ సందర్భంగా మద్యం దుకాణంలో ఉండవలసిన మద్యం అధిక రేట్లకు విక్రయించే బెల్ట్ షాపు వారికి వైన్స్ ఓనర్లు విక్రయించి వైన్సులలో మాత్రం చల్ల చల్లటి బీర్లు లేవని నో స్టాక్ బోర్డులు ఏర్పాటు చేయడం నెక్కొండ మద్యం ప్రియులను ఇబ్బందులకే గురిచేసిందని చెప్పవచ్చు. కానీ బెల్ట్ షాపులలో బీర్లు ఒక్కొక్క బాటిల్ పైన 40 నుండి 60 రూపాయల వరకు తీసుకోవడం జరిగిందని వెంటనే సంబంధిత ఎక్సైజ్ శాఖ వారు స్పందించి మండల వ్యాప్తంగా ఉన్న బెల్ట్ షాపులను తనిఖీలు నిర్వహించి అధిక ధరలకు అమ్ముతున్న వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ శాఖ వారిని కోరుతున్నారు. . @బాటిల్లపై స్టిక్కర్లు వేస్తున్నాం రైడింగ్లు చేస్తున్నాం…! మండలంలోని నాలుగు వైన్ షాపులు ఏర్పడగా ఒక్కొక్క షాపు ఏడు గ్రామాలను పంచుకొని ఒక్కొక్క వైన్ షాప్ ఒక రకమైన కోడ్ గల స్టిక్కర్ ను అంటించి బాటిల్ పై 20, 40, 60, 80, రూపాయల అధిక రేట్లకు బెల్ట్ షాపు నిర్వాహకులకు అమ్ముతుండగా బెల్ట్ షాప్ వారు వైన్ షాప్ నిర్వాహకులు ఇచ్చిన రేట్లును అధికం చేస్తూ మద్యం ప్రియుల జేబుకు చిల్లు పెడుతుండడం గమనార్థం. ఇలా వైన్స్ నిర్వాహకులు బెల్ట్ షాప్ వారికి అధిక రేట్లకు అమ్మిన తర్వాత తమ సిబ్బందితో బెల్ట్ షాపుల పై రైటింగ్ లు నిర్వహిస్తూ సక్రమంగా తమ షాపు దగ్గర తీసుకున్న స్టాక్ మాత్రమే అమ్మే విధంగా ఈ వైన్స్ షాప్ రైడర్స్ బెల్ట్ షాపులను తనిఖీలు నిర్వహిస్తుండడం చర్చనీ అంశంగా మారింది. . ఇదంతా జరుగుతున్న కన్నెత్తి చూడని ఎక్సైజ్ శాఖ. . . నెక్కొండ మండలంలో వైన్స్ మరియు బెల్ట్ షాపుల నిర్వాహకులు అధిక రేట్లకు అమ్ముతున్న వైన్స్ లలో సిట్టింగ్ పర్మిషన్ లేకున్నా ఎక్సైజ్ శాఖ వారు మాత్రం చూచి చూడనట్టు ఉండడంతో ఎక్సైజ్ శాఖ పై ప్రజలు పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు ఇకనైనా వెంటనే ఎక్సైజ్ శాఖ కు సంబంధించిన అధికారులు స్పందించి అధిక రేట్లకు అమ్మిన షాపుల పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. . @వాహనదారులకు ఇబ్బందిగా మారిన మద్యం దుకాణాలు . నెక్కొండ కు ప్రధాన రహదారులైన వరంగల్ మరియు నర్సంపేట రోడ్లలో వైన్ షాపులతో వాహనదారుడు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వైన్స్ షాపులలో సిట్టింగ్ లేకపోయినా అధికారుల అండదండలతో వైన్స్ ఓనర్లు సిట్టింగ్ నిర్వహించడం పట్ల వైన్ షాపుల ముందు వందల సంఖ్యలో వాహనాలు నిలపడంతో రోడ్డు మార్గాన వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడడంతో పాటు ప్రమాదాలకు గురికావడం జరుగుతుంది .