సిపిఐ పట్టణ కార్యదర్శి సోతుకు.ప్రవీణ్ కుమార్
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి పట్టణంలో భగత్ సింగ్ కాలనీలో సిపిఐ పట్టణ కమిటీ కార్యాలయంలో ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా సిపి పట్టణ కార్యదర్శి సోతుకు.ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ప్రొఫెసర్ సాయిబాబా మరణం సమాజానికి తీరని లోటు అని అన్నారు. చెయ్యని తప్పుకు పది సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించి నిర్దోషిగా రిలీజ్ అయ్యారని అన్నారు. రిలీజ్ అయిన ఏడు నెలలకు అనారోగ్యంతో మృతి చెందారని అన్నారు. సాయిబాబా గారు ఆదివాసులు, దళితులు,విద్యార్థులు రైతులు కార్మికుల పక్షన అనేక పోరాటాల నిర్వహించిన వ్యక్తి అని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ లో జన్మించి తెలంగాణ రాష్ట్రం కోసం ఢిల్లీలో విద్యార్థులతో అనేక ఉద్యమాలు నిర్వహించారని తెలిపారు. ప్రొఫెసర్ సాయిబాబా ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ పట్టణ నాయకులు పీక రవి,బుపేల్లి రామచేందేర్, ఇద భాస్కర్,రమేష్ చారి,రాజు, ఓర్స్ రాజయ్య తదితరులు పాల్గొన్నారు