రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
వీరమల్ల మల్లయ్య గత వారం క్రితం మరణించగా దశదిన ఖర్మకు వివేక్ యువసేన ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు అందించారు. సోమవారం రామకృష్ణాపూర్ పట్టణంలోని కాకతీయ కాలనీలో చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ యువసేన ఆధ్వర్యంలో 25 కేజీల బియ్యం నిత్యావసర సరుకులను వీరమల్ల మల్లయ్య కుటుంబానికి అందించినట్లు వివేక్ యువసేన అధ్యక్షులు మహేష్, మాజీ ఎంపీపీ మహంకాళి శ్రీనివాస్ లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తిరుపతి, పాల రాజయ్య, తుంగ శ్రవణ్, క్రాంతి తదితరులు పాల్గొన్నారు.