మండల పార్టీ అధ్యక్షుడు జాటోతు శ్రీనివాస్ నాయక్
పర్వతగిరి నేటి ధాత్రి
వరంగల్ జిల్లా
పర్వతగిరి మండలం లోని ఏబి తండాలో ఈ రోజు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జాటోత్ శ్రీనివాస్ నాయక్ పర్యటించారు. చుట్టుపక్కల తండా లకు రోడ్ల మరమ్మతులు కొత్త సీసీ రోడ్లు ఎక్కడెక్కడ వేయాలో అడిగితెలుసుకున్నారు. రెండు మూడు రోజుల్లో వర్దన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుతో మాట్లాడి సమస్యలు వివరిస్తా అని అన్నారు. అతి తొందరలోనే పనులు మొదలయ్యేలా కృషి చేస్తానని తండా వాసులకు చెప్పారు.రేవంత్ రెడ్డి నాయకత్వం లో ప్రజా పాలన అందించే దిశగా అడుగులు వేస్తామని ప్రతిపక్షాల కుట్ర పూరిత విమర్శలకు తిప్పి కొడతామని తెలిపారు. ఈ కార్యక్రమం లో సోమారం ఎక్స్ ఎంపీటీసీ ఎస్.కె మహ్మద్ అలీ, తండా అధ్యక్షులు మాలోత్ రవి, మాలోత్ శ్రీనివాస్, రాజేందర్ మరియు తండా నాయకులు పాల్గొన్నారు.