# బతకమ్మ,దసరా,దీపావళి పండుగల ఆసరాతో ఇష్టారాజ్యం..
# ఆలస్యం వద్దు … గాలి వచ్చినప్పుడు తూర్పాల పట్టాల్సిందే..
# సినీ తారలతో ఓపెనింగ్…
# పట్టణంలో కాసం ప్యాసన్ మాల్ ఓపెన్ పట్ల …. పెద్ద పెద్ద బోర్డింగ్స్….
# బిల్డింగ్ కన్స్ట్రక్షన్ పర్మిషన్ ఉంటే సరిపోతుందా..
# ఒక్కపూట పూలు అమ్ముకుంటే… పర్మిషన్ తీసుకోవాలి … కాసం ప్యాసన్ మాల్ కు అవసరం లేదా..?
#
# పేదోళ్ళ వద్దకు గద్దల్ల వాలే మున్సిపాలిటీ సిబ్బందికి కాసం ప్యాసన్ మాల్ కు ఓపెన్ పట్ల తెలువదా…?
# ఇంటి నెంబర్ లేదు.. ట్రేడింగ్ లైసెన్స్ లేదు.. మున్సిపాలిటీ పర్మిషన్ లేదు… ఫైర్ సేఫ్టీ సర్టిఫికెట్ లేదు..
నర్సంపేట,నేటిధాత్రి :
నర్సంపేట పట్టణంలో ఒక్కరోజు పువ్వులు, కూరగాయలు అమ్ముకునే రైతుల వద్దకు గద్దల్లా వాలే మున్సిపాలిటీ సిబ్బందికి అనుమతులు లేకుండా లక్షల్లో వ్యాపారం చేసే నూతనంగా ప్రారంభించిన కాసం ఫ్యాషన్ షాపింగ్ మాల్ కనబడటం లేదా అని పట్టణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు.బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కు మాత్రమే పర్మిషన్ తీసుకొని ఏకంగా బట్టల ప్యాషన్ మాల్ ను సినీ తారలతో ఓపెన్ చేశారు. వారం రోజుల ముందే నర్సంపేట మున్సిపాలిటీ అధికారుల నుండి ఎలాంటి అనుమతులు లేకున్న పట్టణంలో పెద్ద పెద్ద బోర్టింగ్స్ ఏర్పాటు చేశారు.ముందుగా బిల్డింగ్ నిర్మాణం కోసం మాత్రమే పర్మిషన్ తీసుకొని ఆ పనులు పూర్తి కాకముందే ఇంటి నెంబర్ లేదు.. ట్రేడింగ్ లైసెన్స్ లేదు.. మున్సిపాలిటీ పర్మిషన్ లేదు… ఫైర్ సేఫ్టీ సర్టిఫికెట్ లేకుండా ఈ తతంగం మొత్తం బహిరంగంగానే జరుగుతున్నప్పటికీ దున్నపోతు మీద వాన పడ్డట్టుగా మున్సిపాలిటీ అధికారులు మాత్రం చూసి చూడనట్టుగా వ్యవహరించారని పట్టణంలోని ప్రజల ఆరోపణలు గట్టిగానే వినిపిస్తున్నాయి. నర్సంపేట పట్టణంలో శుక్రవారం కాసం ఫ్యాషన్ షో రూమ్ ను ప్రముఖ సినీతార అనసూయ ప్రారంభం చేశారు. వారి స్వలాభం కోసం హడావుడిగా ఫ్యాషన్ మాల్ను ప్రారంభించిన యాజమాన్యం అందుకు ఎలాంటి అనుమతులు తీసుకోకపోవడం పట్ల ఆంతర్యం ఏమిటని ప్రశ్నార్థకంగా మారింది. భవన నిర్మాణం కోసం మాత్రమే గతంలో పర్మిషన్ తీసుకున్నారు. షాపింగ్ మాల్స్ ఓపెన్ చేయడానికి ముందు ఆక్యుపెన్సీ(ఓ.సి) పర్మిషన్, హౌస్ నంబర్ కోసం పర్మిషన్ల కోసం దరఖాస్తుల అనంతరం ధ్రువీకరణ పొందాలి. ఆ తర్వాత ట్రేడ్ లైసెన్స్ ల కోసం దరఖాస్తు చేసుకోవాలి.పూర్తిస్థాయిలో పరిశీలించిన మున్సిపాలిటీ కార్యాలయం నుండి సంబంధిత ధ్రువీకరణ పత్రాలు పొందాల్సి ఉంటుంది. అలాగే అగ్నిమాపక కేంద్రం నుండి ఫైర్ సేఫ్టీ ధ్రువీకరణ కోసం దరఖాస్తు చేసుకోవాలి వారు షాపింగ్ మాల్ ను పరిశీలించి అనుకూలంగా ఉంటేనే ధ్రువీకరణ పత్రాన్ని అందిస్తారు.అప్పుడు మాల్ ప్రారంభోత్సవం చేసుకోవాల్సి ఉంటుంది.కానీ అందుకు విరుద్ధంగా కాసం ఫ్యాషన్ షో రూమ్ ను ఓన్లీ భవన నిర్మాణం కోసం మాత్రమే పర్మిషన్ తీసుకొని కనీసం ఆక్యుపెన్సీ(ఓ.సి) పర్మిషన్, హౌస్ నంబర్ కోసం పర్మిషన్,ట్రెడ్ లైసెన్స్ ల పర్మిషన్ల కోసం దరఖాస్తు చేసుకోకుండా సినీ తారతో గ్రాండ్ గా ఓపెన్ చేయడం పట్ల మున్సిపాలిటీ అధికారుల ఆంతర్యం ఏమిటని పట్టణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. రోజువారి పని చేసుకుంటూ చిన్నపాటి పువ్వులు, కూరగాయలు అమ్ముకునే మా వద్ద గద్దల వాలి డబ్బులు వసూలు చేసే మున్సిపాలిటీ సిబ్బంది కండ్లు మూసుకున్నారా అని చిన్నపాటి రోజువారి వ్యాపారులు పట్టణ ప్రజలు ఆరోపిస్తున్నారు. నర్సంపేట పట్టణంలో పేదోళ్లకు ఒక న్యాయం ఉన్నోళ్లకు ఒక న్యాయంగా మున్సిపాలిటీ అధికారులు వ్యవహరిస్తున్నారని పట్టణ ప్రజలు ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇప్పటికైనా మున్సిపాలిటీ అధికారులు స్పందించి కాసం ఫ్యాషన్ షాపింగ్ మాల్ యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకొని ఫ్యాషన్ మాల్ మూసివేయాలని పట్టణ ప్రజల డిమాండ్ చేస్తున్నారు.
కాసం ఫ్యాషన్ షో రూమ్ కు పర్మిషన్ ఉన్నది..
నర్సంపేట పట్టణంలో శుక్రవారం ప్రారంభమైన కాసం ఫ్యాషన్ షో రూమ్ పట్ల మున్సిపల్ కమిషనర్ జోనా ను వివరణ కోరగా కాసం ఫ్యాషన్ షాపింగ్ కు పర్మిషన్ ఉన్నది. కానీ బిల్డింగ్ పర్మిషన్ మాత్రమే ఉన్నది. హౌస్ నెంబర్,ఆక్యుపెన్సీ(ఓ.సి), ట్రేడ్ లైసెన్స్ ల కోసం ఎలాంటి దరఖాస్తులు చేసుకోలేదు అని కమిషనర్ వివరణ ఇచ్చారు.