కరీంనగర్, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెదిర గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబనికి చెందిన సామల రాజు కొన్ని రోజుల క్రితం దుబాయ్ కి వెళ్లి తన కుటుంబన్ని పోషిస్తున్నాడు, నెల రోజుల క్రితం ఇంటికి వచ్చి సుల్తానాబాద్ దగ్గర రోడ్డు ప్రమాదంలో జరిగిన బైక్ ప్రమాదంలో మృతి చెందారు. మృతుడికి ముగ్గురు చిన్న పిల్లలు, భార్య, తల్లి తండ్రి వృద్ధాప్యంలో ఉన్నారు. కడుబీద కుటుంబమైన వీరికి దుబాయ్ ఎల్లాల శ్రీనన్నా సేవాసమితి సీనియర్ సభ్యుడైన కొండపత్రి నరేష్ వెంటనే దుబాయ్ ఎల్లాల శీనన్నా సేవా సమితి అధ్యక్షులు రవి డేవిడ్, ఉపాధ్యక్షులు బొమ్మిడి బాలుకి ఈజరిగిన విషయం చెప్పడంతో వెంటనే స్పందించి జగిత్యాల జిల్లా సామజిక సేవకులు ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ ఎల్లాల శ్రీనివాస్ రెడ్డికి తెలియజేశారు. గ్రూప్ సభ్యులతో మాట్లాడి సేవా సమితి ద్వారా ఇరవై వెయ్యిల రూపాయల సహాయాన్ని వారి కుటుంబానికి అందించడం జరిగినది. ఈకార్యక్రమంలో దుబాయ్ ఎల్లాల శ్రీనన్న సేవాసమితి మాజీ అధ్యక్షులు రవి ఉట్నూరి, వ్యవస్థాపకులు మాజీ సర్పంచ్ నేరువట్ల బాబు స్వామి, సేవాసమితి ప్రధాన కార్యదర్శి చిలుముల రమేష్, కన్నం బుచ్చయ్య, తదితరులు పాల్గొన్నారు.