తొర్రూర్ సిఐ జగదీష్
తొర్రూర్ (డివిజన్ )నేటి ధాత్రి:
యువత చదువుతో పాటు క్రీడల్లో రాణించాలనీ తొర్రూర్ సిఐ జగదీష్ అన్నారు. దసరా పండుగ సంబరాల్లో భాగంగా గురువారం మండలంలోని వెళ్లి కట్టే గ్రామంలో ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి క్రికెట్ క్రీడోత్సవాలను ప్రారంభించారు. అనంతరం ఈ మధ్య రోడ్డు ప్రమాదంలో చనిపోయిన కానిస్టేబుల్ విజేందర్ క్రీడాకారుడు అతనికి రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు. క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..క్రీడలు మానసికోల్లాసానికి, శారీరక దృఢత్వానికి ఎంతగానో దోహదపడతాయని, క్రీడాకారులు గెలుపు, ఓటములు సమానంగా భావించి, క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగాలని కోరారు. క్రీడల్లో రాణిస్తే ఉద్యోగ అవకాశాలు ఉంటాయని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో యువతను ప్రోత్సహించి, యువత చెడు దారి పట్టకుండా క్రీడలు ఉపయోగపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై ఉపేందర్, క్రీడాకారులు పోసాని సంతోష్ క్రీడాకారులు తదితరులు పాల్గొన్నరు.