మాజీ ఉపసర్పంచ్ కుక్కల బిక్షపతి
శాయంపేట నేటిధాత్రి:
శాయంపేట మండలం మాందా రిపేట గ్రామంలో యువ చైతన్య గ్రూప్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన దుర్గామాత నవరాత్రి ఉత్సవాలను గ్రామ ప్రజలు,యువత భక్తిశ్రద్ధలతో అంగరంగ వైభవంగా జరుపుకోవాలని తహరాపూర్ గ్రామ మాజీ ఉప సర్పంచ్ కుక్కల బిక్షపతి అన్నారు. తహరాపూర్ గ్రామంలో దుర్గామాత ఉత్సవాలను ప్రతి ఏటా యువ చైతన్య గ్రూప్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తారు. కాగా గ్రామ మాజీ ఉప సర్పంచ్ బిక్షపతి తన వంతుగా యువ చైతన్య గ్రూప్ కు 40 వేల విలువగల అంప్లిపైర్ యర్ సౌండ్ బాక్సులను బహుకరించారు. ఈ సందర్భంగా బిక్షపతి మాట్లాడుతూ గ్రామంలోని ప్రజలందరినీ దుర్గమ్మ చల్లగా చూడాలని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా యువత ముందుకు పోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ జిన్న రాజేందర్, పరకాల వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ రేణికుంట్ల సదయ్య, మాజీ ఎంపీటీసీ నిమ్మల రమేష్, పున్నం పురుషోత్తం రెడ్డి , పూజారి కొమురయ్య, బండారి పైడి, చందనాల సునీల్, రావుల శ్రీనివాస్ యూత్ సభ్యులు పాల్గొన్నారు.