వనపర్తి నేటిధాత్రి :
వనపర్తి పట్టణంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మాజి మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి 65 వ జన్మదిన వేడుకలు ఆయన నివాసంలో పట్టణ బీ ఆర్ ఎస్ అధ్యక్షులు పలస రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి వనపర్తి నియోజకవర్గంలో వనపర్తి పట్టణంలో మాజీ ముఖ్యమంత్రి కే సీఆర్ సహకారంతో రోడ్ల విస్తరణ చెరువులు ఎస్పీ కార్యాలయం కలెక్టరేట్ కార్యాలయం మార్కెట్ యార్డ్ పాత గంజిలో సమీకృత వ్యాపార సముదాయం నిర్మాణం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టా రనిని గుర్తు చేశారు. అనంతరం ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ లో పండ్లు బ్రెడ్ లు రోగులకు పంపిణీ చేశారు పుట్టినరోజు వేడుకలలో మున్సిపల్ మాజీ చైర్మన్ గట్టు యాదవ్ మీడియా సెల్ ఇంచార్జ్ నందిమల్ల అశోక్ పరంజ్యోతి డాక్టర్ డానియల్ సూర్యవంశీ గిరి చిట్యాల రాము గాడిదల మోహన్ హేమంత్ ముదిరాజ్ బీ ఆర్ ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు . ఈ సందర్భంగా మాజీ మంత్రి విదేశాల్లో ఉన్న నిరంజన్ రెడ్డికి ఫోన్ ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు
వనపర్తి లో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు
