
ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి.
బెల్లంపల్లి నేటిధాత్రి :
కన్నాల గ్రామం నుండి బుగ్గ దేవాలయం వరకు మూడు కోట్ల నిధులతో రోడ్డు నిర్మాణ పనులను శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి,జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్.అనంతరం బుగ రాజరాజేశ్వర స్వామి వారి నీ దర్శనం చేసుకొని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే గడ్డం వినోద్,కలెక్టర్ కుమార్ దీపక్ ఎమ్మెల్యే మాట్లాడుతూ.కన్నాల గ్రామం నుండి బుగ్గ దేవాలయం వరకు మూడు కోట్ల నిధులతో రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉంది బుగ్గ రాజరాజేశ్వర దేవాలయనికి వెళ్ళడానికి రోడ్డు సరిగా లేకపోవడం వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని తన దృష్టి కి రావడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తో మాట్లాడి వారి సహకారంతో రోడ్డు మంజూరు చేసుకోవడం చాలా మంచి విషయం రోడ్డు పనులు త్వరగా పూర్తి చేయాలని శివరాత్రి లోపు ప్రజలకు అందుబాటులో కి తీసుకురావాలని కాంట్రాక్టర్ కు సూచించారు.బెల్లంపల్లి నియోజక వర్గాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తాను రానున్న రెండు సంవత్సరాలలో 450 కోట్ల నిధులతో బెల్లంపల్లి ప్రజలకు త్రాగునీటి సౌకర్యాలు కల్పిస్తాము
బెల్లంపల్లి నియోజకవర్గానికి 1500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యే అవకాశముంది.అర్హులైన పేదలకు ఇంద్రమ్మ ఇల్లు ఇస్తాం.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జక్కుల శ్వేతా, మండల నాయకులు, పట్టణ నాయకులు, కార్యకర్తలు ప్రజాప్రతినిధులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.