
మంత్రికి మాజీ ఎమ్మెల్యే సవాల్.
నిరూపించకుంటే మీరు తప్పుకుంటారా.
కేటీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు మానుకోవాలి.
వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నపునేని
కాశిబుగ్గ నేటిధాత్రి
గత కొన్ని రోజుల నుండి కేటీఆర్ పై అనుచిత వ్యాఖ్యల పై నిరసనగా లేబర్ కాలనీ జంక్షన్ లో వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ ఆధ్వర్యంలో భారీ ధర్నా చేపట్టారు.బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పై మంత్రి కొండా సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్యల పై ఈ రోజు లేబర్ కాలనీ జంక్షన్ లో తెలంగాణ రాష్ట్ర వరంగల్ తొలి మేయర్, మాజీ శాసనసభ్యులు నన్నపునేని నరేందర్ ఆధ్వర్యంలో భారీ ధర్నా కార్యక్రమం జరిగింది. ఈ విధంగా నరేందర్ మాట్లాడుతూ మంత్రి కొండా సురేఖ కేటీఆర్ పై ఇలా అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు,నువ్వు చేసిన సవాలును నిరూపిస్తావా లేదా తక్షణమే క్షమాపణ చెప్పుతావా, వరంగల్ జిల్లా అంటే రాణి రుద్రమదేవి పౌరుషం, అలాంటి రాణి రుద్రమదేవి ఏలిన గడ్డ వరంగల్ పరువు ప్రతిష్ట ను దిగజారుస్తున్నారు అని మండిపడ్డారు.మీరు చేసిన సవాలును మీరు నిరూపిస్తే నేను శాశ్వతంగా రాజకీయాలకు దూరంగా ఉంటాను,సవాలును నిరూపించకపోతే మీరు రాజకీయాలకు దూరం ఉంటారా అని ప్రశ్నించారు.ఒక ఉన్నత కుటుంబానికి చెందిన నాగార్జున కుటుంబాన్ని అవమానపర్చడం సమంజసమా, ఒక ఆడపిల్ల జీవితం గురించి అనుచిత వ్యాఖ్యలు చేసి ఇలా రోడ్డు మీద వేయడం సిగ్గుచేటు అని అన్నారు.ఈ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలను పట్టించుకోకుండా హైడ్రా అని కొత్త డ్రామా తెర మీదకు తెచ్చి పేద ప్రజల జీవితాలతో ఆడుకుంటుంది.కేటిఆర్ పై చేసిన వ్యాఖ్యలు తక్షణమే వెనుక్కు తీసుకోవాలి,లేని యెడల ఇంకా తీవ్రమైన నిరసనలు ఎదురుకుంటారు అని నరేందర్ హెచ్చరించారు. ఈ కార్యక్రమం లో కార్పొరేటర్లు దిడ్డి కుమారస్వామి, మారుపల్ల రవి మరియు మాజీ కార్పొరేటర్ కుందారపు రాజేందర్, ముఖ్య నాయకులు, మహిళా నాయకురాలు, యూత్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.