భద్రాచలo నేటి ధాత్రి
ఈరోజు భద్రాచలం మండలంలో వివిధ కాలనీలో రోడ్లు మరియు డ్రైనేజ్ పనులకు శంకుస్థాపనలకు ముఖ్యఅతిథిగా పాల్గొన్న భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు
శాంతినగర్ కాలనీ, సుభాష్ నగర్ కాలనీ, అశోక్ నగర్ కొత్త కాలనీ, ఎ ఎస్ ఆర్ కాలనీ, ఆదర్శనగర్ కాలనీ, అభయ ఆంజనేయ స్వామి పార్క్ ఎదురుగా డ్రైనేజీ మరియు కాలనీలో రహదారి లేక ఇబ్బంది పడుతున్నమని కాలనీవాసులు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే ని కలిసి వారి సమస్యలు పై వినతి పత్రం సమర్పించారు.
వెంటనే స్పందించిన ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు రోడ్లు మరియు డ్రైనేజీలకు సంబంధించిన అధికారులతో మాట్లాడి పై చెప్పిన కాలనీలో రోడ్లు మరియు డ్రైనేజీలు ఎస్టిమేట్ వేసి నిధులు మంజూరు చేయడం జరిగింది.
అట్టి పనులను ఈరోజు భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు చేతుల మీదుగా కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు.
కాలనీవాసులు ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు గారికి బ్రహ్మ రథం పట్టారు.
ఎ ఎస్ ఆర్ కాలనీ వాసుల 20 ఏళ్ల నాటి కలను నెరవేర్చిన భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు
సుభాష్ నగర్ కాలనీలో అయ్యా మీరు ఎమ్మెల్యే అయ్యాక మొన్న వర్షాలకు గోదావరి వరద నీరు కాలనీలోకి రాకుండా కరకట్ట నిర్మించడం చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు. మీలాంటి ఎమ్మెల్యేని గెలిపించుకోవడం మాకు ఆనందంగా ఉందని తెలిపారు.
అశోక్ నగర్ కాలనీలో కరెంటు స్తంభాలు లేక ఇబ్బంది పడుతున్నారని తెలుపగా అధికారులతో గారితో మాట్లాడి కరెంటు స్తంభాలు వేయాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్ భోగాల శ్రీనివాస్ రెడ్డి, మండల నాయకులు రత్నం రమాకాంత్, బొంబోతుల రాజీవ్, రత్నం రజనీకాంత్,ఎండి నవాబ్ , అరికెల తిరుపతిరావు,పెద్దినేని శ్రీనివాస్ , నర్రా రాము, చుక్క సుధాకర్, మామిడి పుల్లారావు, భీమవరపు వెంకటరెడ్డి, చెగొండి శ్రీనివాస్, దుద్దుకురి సాయిబాబా, ఒగ్గె రమణ, కాపుల శ్రీను, రసమళ్ళ రాము, యూత్ నాయకులు గాడి విజయ్, ఆకుల వెంకట్, పుల్లగిరి నాగేంద్ర, అవూనురి దుర్గ ప్రసాద్, కొప్పుల రాజా, జామిర్, మహిళలు గంగా భారతి , లక్ష్మి కాంతం, కాసింబీ, సాయి కుమారి తదితరులు పాల్గొన్నారు