భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి మున్సిపాలిటీని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు తెలిపారు. గురువారం భూపాలపల్లి పట్టణంలోని 15, 18, 20, 21, 22, 19 వార్డులైన కాకతీయ కాలనీ, ఎల్బీనగర్, శాంతి నగర్, హనుమాన్ నగర్, జంగేడు రోడ్డు, బానోత్ వీధి ఫేజ్ – 4 కింద సుమారు రూ.1 కోటి 76 లక్షల వ్యయంతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు జెడ్పి సీఈఓ, జిల్లా అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు) విజయలక్ష్మి తో కలిసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు శంకుస్థాపనలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ… భూపాలపల్లి నియోజకవర్గ అభివృద్ధి కొరకు శక్తివంచన లేకుండా పనిచేస్తున్నట్లు తెలిపారు. భూపాలపల్లి మున్సిపాలిటీ తో పాటు, నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే ఈ సందర్భంగా తెలిపారు. సదరు గుత్తేదారు పనులను నాణ్యతతో త్వరితగతిన పూర్తి చేయాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ శంకుస్థాపన కార్యక్రమాలలో మున్సిపల్ కమిషనర్ రాజేశ్వర్ కౌన్సిలర్ నాగవెల్లి సరళ రాజలింగమూర్తి కాంగ్రెస్ పార్టీ నాయకులు అంబాల శీను బుర్ర కొమురయ్య తోట రంజిత్ పలువురు అధికారులు, కాంగ్రెస్ నేతలు ఉన్నారు._