
నర్సంపేట,నేటిధాత్రి :
నర్సంపేట పట్టణ నూతన ఎస్సై గా పదవి బాధ్యతలు చేపట్టిన రవికుమార్ ను గురువారం బిజెపి నర్సంపేట పట్టణ అధ్యక్షులు శీలం రాంబాబు గౌడ్ ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు.అనంతరం పట్టణ ఎస్సై రవికుమార్ మాట్లాడుతూ. శాంతి భద్రత విషయంలో ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు. సన్మానించిన వారిలో నర్సంపేట పట్టణ బిజెపి ప్రధాన కార్యదర్శులు కొంపెల్లి రాజేందర్, గూడూరు సందీప్,ఉపాధ్యక్షులు ఠాకూర్ శివ ఇంజన్ సింగ్, వల్లజి నరేందర్, ఠాకూర్ విజయ్ సింగ్, వరంగంటి రాజ్ కుమార్, సోషల్ మీడియా పట్టణ ఇంచార్జ్ సామల ప్రవీణ్ కుమార్,ఓబిసి మోర్చా అధ్యక్షులు తౌటం నిశాంత్ తదితరులు పాల్గొన్నారు.