-నరేంద్రుడి ఆశయ సాధనకై కంకణ బద్దుడైన పెండ్లి మల్లారెడ్డి
-భారతీయ జనతా పార్టీ ఎదుగుదలే లక్ష్యంగా ఆయన అడుగులు
-యువతకు, విద్యార్థులకు ఆయనే ఒక ప్రేరణ
మొగులపల్లి నేటి ధాత్రి
భరతమాత సేవలో ప్రధాని నరేంద్రుడు పరితపిస్తుంటే..ఆయన ఆశయ సాధనకై కంకణ బద్ధుడైన పెండ్లి మల్లారెడ్డి అనే యువకుడు మండలంలో భారతీయ జనతా పార్టీ ఎదుగుదలే లక్ష్యంగా..యువతకు, విద్యార్థులకు ఆయనే ఒక ప్రేరణగా నిలుస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని ఇస్సిపేట గ్రామానికి చెందిన పెండ్లి ప్రమీల-జనార్ధన్ దంపతులకు 6 ఆగస్టు 1989వ సంవత్సరంలో ఆయన రెండవ సంతానంగా జన్మించారు. ఆయనకు ఇద్దరు సోదరీమణులు ఉన్నారు. ఆయన 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు జడ్పీహెచ్ఎస్ ఇస్సిపేటలో, ఓపెన్ ఇంటర్ జడ్పీహెచ్ఎస్ మొగుళ్ళపల్లిలో, డిగ్రీ కాకతీయ యూనివర్సిటీ హన్మకొండలో, పీజీ శాతవాహన యూనివర్సిటీ కరీంనగర్ లో విద్యాభ్యాసం చేశారు. ఉన్నత చదువులు చదివిన మల్లారెడ్డి దేశ సేవ చేయాలనే సంకల్పంతో..దేశభక్తి భావాలు కలిగిన బిజెపి పట్ల ఆకర్షితుడైనాడు. ప్రధాని నరేంద్ర మోడీ దేశ సేవలో అంకితమైన తీరును చూసి మల్లారెడ్డి నాటి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నేతృత్వంలో భారతీయ జనతా పార్టీలో చేరారు. పార్టీలో చేరిన అనంతరం మల్లారెడ్డి చురుకుతనాన్ని చూసిన అధిష్టానం 2014 సంవత్సరంలోనే ఆయనను బిజెపి గ్రామ శాఖ అధ్యక్షునిగా నియమించింది. 2014 సంవత్సరం నుండి 2019 సంవత్సరం వరకు ఆయన ఆ పదవిలో కొనసాగారు. అనంతరం ఆయన అంకితభావాన్ని, పార్టీకి చేస్తున్న సేవలను గుర్తించిన అధిష్టానం 2021 సంవత్సరంలో బిజెపి మండల ఉపాధ్యక్షుడిగా, శక్తి కేంద్ర ఇన్చార్జిగా బాధ్యతలను అప్పగించింది. ఎంతో ఇష్టంతో ఇచ్చిన బాధ్యతలను నెరవేరుస్తూ..పార్టీ పటిష్టతకు పాటుపడుతూ..భారతీయ జనతా పార్టీని మండలంలో విస్తరింప చేస్తున్నాడు. యువతకు, విద్యార్థులకు ప్రేరణగా నిలుస్తూ..వారిలో జాతీయ భావాలను నింపుతున్నాడు. మండలంలో కలియ తిరుగుతూ..శుభ, ఆశుభ కార్యక్రమాలకు హాజరవుతూ..తన వంతుగా ఆర్థిక సహాయాలను అందిస్తూ..పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకెళుతున్నారు. పార్టీ పటిష్టత కోసం ఇస్సిపేట గ్రామంలో సైతం భారతీయ జనతా పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి..కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్నారు. ఇలాంటి సేవా దృక్పథం కలిగిన నేతకు బిజెపిలో కీలక బాధ్యతలు అప్పగిస్తే..రానున్న రోజుల్లో అధికార పార్టీకి చుక్కలు చూపడం ఖాయం అంటున్నారు ప్రముఖ విశ్లేషకులు.