ఇబ్రహీంపట్నం, నేటిదాత్రి
మండలంలోని వర్ష కొండ గ్రామంలో జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో ముందస్తుగా బతుకమ్మ వేడుకల్లో భాగంగా విద్యార్థిని విద్యార్థులు వివిధ రకాల గుణగ పువ్వులతో అందంగా బతుకమ్మను అలంకరించారు అనంతరం డీజే చప్పట్లతో విద్యార్థి విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు ఆడి పాడారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రసాద్ సెకండరీ పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి రాజేందర్, మరియు ఉపాధ్యాయులు, జి శ్రీనివాసరావు, డి శివకృష్ణ, టి ఇమ్మానుయేల్, ఎస్ మమత, పి సునీత, ఎండి ఇబ్రహీం, జె అశోక్, ఎస్ మల్లికార్జున్, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.