రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
రామకృష్ణాపూర్ పట్టణానికి చెందిన సామాజిక విద్యావేత్త కట్కూరి వెంకటేష్ కు గౌరవ డాక్టరేట్ అవార్డు దక్కింది. ఉత్తరప్రదేశ్ రిటైర్డ్ ఐజి సత్యేంద్ర కెఆర్ సింగ్, సుప్రీంకోర్టు న్యాయమూర్తి బన్వర్ సింగ్ చేతుల మీదుగా డాక్టరేట్ అవార్డును అందుకున్నారు. కేంద్ర ప్రభుత్వ కార్పోరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆమోదించిన హానరరీ డాక్టర్ అవార్డును కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఢిల్లీలోని అశోక హోటల్, చాణక్యపురిలో నిర్వహించిన నాలెడ్జ్ ఇస్ పవర్ సెమినార్ కార్యక్రమంలో కట్కూరి వెంకటేష్ గత పది సంవత్సరాలుగా చేస్తున్న సేవా కార్యక్రమాలకు గౌరవ డాక్టరేట్ అవార్డును అందజేశారు. ఈ కార్యక్రమంలో బాలీవుడ్ హీరోయిన్ శిల్పా శెట్టి, నేహా రాటి ఇండియన్ వెస్ట్రియల్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ నర్సింగ్ యాదవ్, హానరీ డాక్టరేట్ కౌన్సిల్ చైర్మన్ తపస్ కుమార్ రౌతరాయ్, ఫ్రాన్సిస్కో సర్జనా లోక్ సభ మెంబర్లు వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన అవార్డు గ్రహీతలు పాల్గొన్నారు.