ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమానికి చిత్తశుద్ధితో పని చేస్తుంది.

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

చిట్యాల, నేటిధాత్రి :

రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమానికి చిత్తశుద్ధితో పని చేస్తున్నట్లు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు* తెలిపారు. శనివారం చిట్యాల మండల కేంద్రంలోని స్థానిక ఎమ్మార్వో కార్యాలయంలో జిల్లా శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ అండ్ అలిమ్ కో కంపెనీ వారి ఆధ్వర్యంలో సంయుక్తంగా నిర్వహించిన దివ్యాంగులకు సహాయ ఉపకరణాల రిజిస్ట్రేషన్* కార్యక్రమంలో ముఖ్య అతిథిగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పాల్గొని దివ్యాంగుల రిజిస్ట్రేషన్ విధానాన్ని పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమానికి చిత్తశుద్ధితో పని చేస్తుందని అన్నారు. గత ప్రభుత్వంలో పెట్టిన నిబంధనల ప్రకారం కొంత మేర మాత్రమే దివ్యాంగులకు బ్యాటరీ సైకిళ్ళు, స్కూటీలు ఇవ్వడం జరిగిందని ఈ ప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ బ్యాటరీ సైకిళ్ళు, స్కూటీలు అందించేందుకు కృషి చేస్తామని అన్నారు. రాబోయే 1.40 లక్షల ఉద్యోగ నోటిఫికేషన్లలో దివ్యాంగులకు ప్రత్యేక కోటా ఉంటుందని కష్టపడి చదివి ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మడి శ్రీదేవి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గూట్ల తిరుపతి కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ముకిరాల మధు వంశీకృష్ణ మండల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మూలశంకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు,

శ్రీ శరణ్య హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం.

చిట్యాల మండలంలోని జూకల్ గ్రామంలో హన్మకొండ కు చెందిన శ్రీ శరణ్య హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పాల్గొని, మెడికల్ క్యాంప్ ను ప్రారంభించారు. అనంతరం పలువురు ఎమ్మెల్యే కు పూల బొకే లు ఇచ్చి, శాలువాలు కప్పి సన్మానం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!