
నర్సంపేట,నేటిధాత్రి:
ఐసిడిఎస్ నర్సంపేట ప్రాజెక్ట్ పరిధిలోని నర్సంపేట – 4 అంగన్వాడీ కేంద్రంలో స్థానిక అంగన్వాడీ టీచర్ నల్ల భారతి ఆధ్వర్యంలో సెప్టెంబర్ నెల పోషణ మాసం సందర్భంగా పోషణ సంబరాలు ఘనంగా నిర్వహించారు.
ఇందులో భాగంగా ప్రాజెక్టు సిడిపివో మధురిమ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో 14 వ వార్డు కౌన్సిలర్ ఎలకంటి విజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ఈ అంగన్వాడీ కేంద్రంలో అన్ని కార్యక్రమాలు ఆదర్శవంతంగా చేపడుతున్నారని అన్నారు.కలెక్టర్ మంజూరు చేసిన అంగన్వాడీ కేంద్ర భవన నిర్మాణం కోసం స్థానిక ఎమ్మెల్యే మాధవ రెడ్డితో మాట్లాడి వెంటనే నిర్మాణ పనులు చేపట్టేటట్లు చొరవ చూపిస్తానని హామీ ఇచ్చారు.సిడిపివో మధురిమ,ఏసిడిపివో హేమలతలు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పోషణ అభియాన్ ద్వారా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని, పోషణ లోపం నుంచి విముక్తులను చేయడం, రక్తహీనతను తగ్గించడం, ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించడం లక్ష్యంగా ఐసిడిఎస్ ముందుకు సాగుతుందని ఐసిడిఎస్ లో అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గర్భిణీ, బాలింత స్త్రీలు విధిగా వచ్చి అంగన్వాడి కేంద్రంలో ఒక పూట భోజనం చేసి ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మనివ్వాలని సూచించారు. అంగన్వాడీ టీచర్స్ చెప్పే ప్రతి విషయాలను పాటించాలని తెలిపారు. సీనియర్ సిటిజెన్సు ఐసిడిఎస్ లో భాగమని వారికి ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా మమ్మల్ని సంప్రదించాలని తెలిపారు.సీనియర్ సిటిజన్స్ వారోత్సవాల సందర్భంగా 37 మంది సీనియర్ సిటిజన్స్ కు శాలువాలు కప్పి సన్మానించారు. సీనియర్ సిటిజన్స్ వారోత్సవాల సందర్భంగా టీహెచ్ఆర్ పిల్లల తల్లి బొల్లు శ్రావణి బాలామృతంతో తయారుచేసిన కేక్ ను సీనియర్ సిటిజన్ తో కట్ చేయించారు. ఇఎంఏ మహిళా అధ్యక్షురాలు,గైనకాలజిస్ట్ డాక్టర్ భారతి మాట్లాడుతూ సీనియర్ సిటిజన్స్ మాసోత్సవాల సందర్భంగా ఈరోజు సన్మానించబడిన 37 మంది సీనియర్ మహిళలకు క్యాంపు చేపట్టి పరీక్షలు చేసి వారికి అవసరమైన మందులు మూడు నెలల పాటు ఉచితంగా అందిస్తామని,దశలవారీగా సీనియర్ మహిళలందరికీ ఆరోగ్య పరీక్షలు చేస్తానని హామీ ఇచ్చారు.
36 మంది మహిళలు వివిధ పోషకాలతో కూడిన వంటకాలు తయారు చేసి ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది. వంటల పోటీలలో పాల్గొన్న ప్రతి ఒక్క మహిళలకు,అలాగే ప్రీ స్కూల్ పిల్లలకు గేమ్స్ నిర్వహించి బహుమతి ప్రధానం చేశారు.
ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ రమ, ఝాన్సీరాణి,హెల్త్ ఎడ్యుకేటర్ మార్త, మహిళా సాధికారత జిల్లా కోఆర్డినేటర్ పావని, జెండర్ స్పెషలిస్ట్ హర్షిత, మున్సిపల్ కోఆప్షన్ సభ్యురాలు నాయిని సునీత, మాజీ కౌన్సిలర్ వాసం కరుణ, సీనియర్ సిటిజన్ మండల కాంతమ్మ, ఇమ్మడి మంజుల, మాజీ వార్డ్ మెంబర్ తక్కల్లపల్లి ఉమ,ఎస్ఎల్ఎఫ్ అధ్యక్షురాలు అడ్డగట్ల భాగ్య, వార్డ్ స్పెషల్ ఆఫీసర్ లావన్య, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శోభ, ఉపాధ్యాయులు రవీందర్, అంగన్వాడీ టీచర్స్ గొర్రె రాధ,బత్తిని శిరీష,ఎండీ గౌసియా, వాణి, ఆయా సునీత,ఏఎల్ఏంఎస్సి
సభ్యులు గడ్డం భవాని, చార్ల మౌనిక, పాఠశాల అమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్ క్యాతం తేజశ్రీ,ఆర్పి రజిత,ఆశా కార్యకర్తలు రాజమణి, రమ,తల్లులు, పిల్లలు,సీనియర్ సిటిజన్స్ అధిక సంఖ్యలో పాల్గొన్నారు.