
పరకాల నేటిధాత్రి
సెయింట్ గాబ్రియేల్ స్కూల్ ఆవరణలో జిల్లా స్థాయిక్రీడా పోటీలు నిర్వహించడం జరిగింది.జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల(బాలుర)విద్యార్థినిలు 9,10 తరగతులకు చెందిన ఏకు.తేజశ్విని,బి.అనూష ఫుట్బాల్ జట్టుకు ఎంపికయ్యారు.జిల్లా స్థాయి పోటీలకు ఎన్నికైన విద్యార్థినులను పాఠశాల సిబ్బంది శాలువాలతో సన్మానించడం జరిగింది.ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు చిలువేరు సురేందర్ గారు మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతోపాటు క్రీడలు కూడా అవసరం అని క్రీడలు శారీరక ఉల్లాసంతో పాటు మానసిక దృఢత్వాన్ని కలిగిస్తాయని తెలిపారు. క్రీడా పోటీల్లో పాల్గొన్న ఇతర విద్యార్థులను వారు అభినందించారు అలాగే క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని తెలిపారు. అందరూ క్రీడా స్ఫూర్తి ప్రదర్శించాలని,తదుపరి సంవత్సరం విద్యార్థులందరూ క్రీడల్లో రాణించి ఉత్తమ ఫలితాలు సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో పరకాల ఉన్నత పాఠశాల(బాలుర) ప్రధానోపధ్యాయులు చిలువేరు సురేందర్ ఉన్నత పాఠశాల బాలుర ఉపాధ్యాయులు ఎండి షేక్ దావుద్,దొమ్మటి భద్రయ్య,పి.సుచరిత,ఓ.భాగ్యమ్మ,కే అరుణ,స్వప్న,పి.శ్రీనాథ్, డి.నాగయ్య,ఎం.బిక్షపతి,జి సంజీవయ్య తదితరులు పాల్గొన్నారు.