బెల్లంపల్లి (మంచిర్యాల) నేటిదాత్రి
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు రాష్ట్రస్థాయి గుర్తింపు దక్కింది. పోలీస్ శాఖ నిర్వహించిన సర్వేలో బెస్ట్ సిటిజన్ సర్వీసెస్ విభాగంలో రాష్ట్రంలో మూడు ర్యాంక్ దక్కించుకుంది. పౌరులకు సత్వర సేవలు పరిష్కారానికి మేలైన చర్యలు తీసుకుంటున్న ఉత్తమ పోలీస్ స్టేషన్ల ఎంపిక ప్రక్రియను ఇటీవల పోలీస్ శాఖ చేపట్టింది. ఇందుకోసం ఆన్లైన్ ద్వారా ప్రజల నుండి ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. ప్రజలు ఇచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగా బెస్ట్ సిటిజన్ సర్వీసెస్ విభాగంలో రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని బెల్లంపల్లి వన్ టౌన్ కు మూడో ర్యాంక్ సాధించింది.ఇందుకుగాను రామకృష్ణాపూర్ పట్నాలకు చెందిన న్యాయవాది, తెలంగాణ బలహీన వర్గాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాజలింగు మోతె శుక్రవారం టౌన్ ఎస్ హెచ్ ఓ దేవయ్యను ఆయన కార్యాలయంలో కలిశారు.రాష్ట్రస్థాయి గుర్తింపు వచ్చేలా పౌరులకు సత్వల సేవలు అందించి,బాధితుల సమస్యల పరిష్కారాలకు మేలైన చర్యలు తీసుకున్న ఎస్ హెచ్ ఓ దేవయ్యకు రాజలింగు అభినందనలు తెలియజేసి అనంతరం ఆయనను సన్మానించారు