గల్ఫ్ కార్మికులకు అండగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం

– నేడు ప్రజా భవన్ లో ప్రవాసి దివాస్ ప్రారంభం

– ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
సిరిసిల్ల(నేటి ధాత్రి):
గల్ఫ్ కార్మికులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం ఉంటుందని ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ అన్నారు.. శుక్రవారం హైదరాబాద్ జ్యోతిరావు పూలే ప్రజా భవన్ లో ప్రవాసి ప్రజావాణి గల్ఫ్ కార్మికుల కోసం ప్రత్యేక కౌంటర్ ప్రారంభం చేసిన నేపథ్యంలో ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు..
వారు మాట్లాడుతూ గల్ఫ్ కార్మిక శ్రేయస్సు కోసం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం గల్ఫ్ కార్మికులక కోసం వారి సంక్షేమం కోసం సెప్టెంబర్ 17 న జీవోను తీసుకువచ్చారు…
నేడు హైదరాబాద్ జ్యోతిరావు పూలే ప్రజా భవన్ లో ప్రవాసి ప్రజావాణి గల్ఫ్ కార్మికుల కోసం ప్రత్యేక కౌంటర్ ను బీసీ సంక్షేమ శాఖ రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ చే ప్రారంభం చేసుకోవడం శుభ పరిణామం..
గల్ఫ్ లో ఏ కారణం చేత మరణించిన వారి కుటుంబాలకు 5 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వడం జరుగుతుంది..
గల్ఫ్ కార్మికులకు ఏవైనా ఇబ్బంది ఎదురైతే వారి సమస్యల పరిష్కారం కోసం ఒక సలహా మండలి ఏర్పాటు చేయడం జరిగింది..
గల్ఫ్ కార్మికుల పిల్లలకు గురుకులాల్లో తగిన ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది..
గతంలో ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో గల్ఫ్లో మృతి చెందిన కార్మికులకు లక్ష ఎక్స్గ్రేషియా ఇస్తే మళ్లీ రేవంత్ రెడ్డి హయాంలో ఇవ్వడం జరుగుతుంది..
గతంలో కెసిఆర్, కెటిఆర్ గల్ఫ్ కార్మికులను వాడుకొని బొంబాయి భీమండి గల్ఫ్ బతుకులేనా మేం వస్తే గల్ఫ్ కార్మికుల సంక్షేమం 500 కోట్లు కేటాయిస్తామని, మరణిస్తే 5 లక్షలు పరిహారం ఇస్తామని చెప్పి మోసం చేశారు..
గత తొమ్మిది సంవత్సరాలలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ వాళ్ళు లెక్కల ప్రకారం సుమారు 2000 పైగా పార్థివదేహాలు వస్తే గత పాలకులు ఒక్క కుటుంబానికి అనా పైసా కూడా ఇవ్వలేదు..
మేము ఇచ్చిన మాట ప్రకారం 5 లక్షల ఎక్స్గ్రేషియా ఇస్తున్నాం..ఇప్పటికే వేములవాడ నియోజకవర్గానికి చెందిన గల్ఫ్ లో మృతి చెందిన రెండు కుటుంబాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో సిఎంఆర్ఎఫ్ నుండి వారికి 5 లక్షల ఎక్స్ గ్రెషీయా ఇవ్వడం జరిగింది..
కెసిఆర్ గతంలో రాజన్న ఆలయానికి ఏట 100 కోట్లు ఇస్తానని, ముంపు గ్రామాల ప్రజలకు డబల్ బెడ్రూమ్ ఇస్తారని మోసం చేశారు..
నిన్నటి రోజున కేటీఆర్ మాట్లాడుతూ ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా మనమడిగా వచ్చానని మాట్లాడడం విడ్డూరంగా ఉంది..
ఇదే ముంపు గ్రామం కొదురుపాక లో చిన్నప్పుడు ఆడుకున్న నువ్వే అధికారంలో ఉన్నప్పుడు గ్రామస్తులు పడుతున్న బాధలను మీ తండ్రి ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయలేదన్నారు..
గల్ఫ్ కార్మికుల పక్షాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను..ప్రజా సమస్యల పరిష్కారంలో తెలంగాణ ప్రభుత్వం ముందుంటుందన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!