టెస్కోలో సుష్టుగా తిన్నవాళ్ల ఇష్టా రాజ్యం!

https://epaper.netidhatri.com/view/389/netidhathri-e-paper-27th-september-2024%09

`నిజాయితీ అధికారులకు స్థాన చలనం!

`నిజాయితీ పరులు చెల్లాచెదురయ్యారు!

`విచారణ అధికారులు కష్టాలపాలయ్యారు!!

`టెస్కోలో బట్టలు తిన్నారు?

`తిన్నింటి వాసాలు లెక్కబెట్టారు!

`నేతన్నల పొట్టగొట్టి మేసేశారు!

`టెస్కోను లూటీ చేశారు?

`లాభాలు చూపించామని లబ్ధి పొందారు!

`తప్పుడు లెక్కలతో కోట్లు దండుకున్నారు?

`బోగస్‌ సహకార సంఘాల పేరు దోచుకున్నారు!

`బట్టను బంగారు బిస్కట్లు చేసుకొన్నారు.

`మా దేవత మీద నేటిధాత్రి రాతలా!

`దేవత కాళ్లు మీడియా నేటిధాత్రి కడగాలా?

`మా దేవత కాళ్లు కడిగి నెత్తిన పోసుకోండి!

`అవినీతి జరగలేదని రాసివ్వమని ఉద్యోగుల మీద ఒత్తిడి!

`అలుగు వర్షిణి ఒత్తిడితోనే విచారణకు సహకరించామని రాయండి!

`మా తప్పేం లేదని అంతా అలుగు వర్షిణి ఒత్తిడే అని చెప్పండి!

`మా మంత్రే అసలు ముఖ్యమంత్రి అని భయపెడుతున్నారు?

`అవకతవకలు జరగలేదని మంత్రులకు లెటర్లు రాసి పంపించారు!

`మంత్రుల నోరు మూయించి అవినీతిని దాచేస్తారా?

`ఎంక్వౌరీ చేసిన నిజాయితీ అధికారులకు శిక్షలా!

`అవినీతి చేసిన వాళ్లకు ప్రమోషన్లా?

`శైలజా రామయ్యకు స్థాన చలనం ఎందుకు జరిగింది.

`అలుగు వర్షిణీ చేనేత కమీషనర్‌గా ఎందుకు వచ్చారు?

`ప్రభుత్వం మారగానే శైలజా రామయ్య మళ్ళీ కమీషనర్‌ కుర్చీలోకి ఎలా వచ్చారు?

`అలుగు వర్షిణిని తప్పించి శైలజా రామయ్య మళ్ళీ ఎందుకొచ్చారు?

`అలుగు వర్షిణి గురుకులాకు ఎందుకు వెళ్లారు?

`గత ప్రభుత్వంలో శైలజా రామయ్యను ఎందుకు తప్పించారు?

`అవతవకలపై ఈ ప్రభుత్వం ఎందుకు విచారణ జరిపించారు?

`జయేష్‌ రంజన్‌ రాసిన లెటర్లు చిత్తు కాగితాలా?

`గతంలో టెస్కోలో అవినీతిపై కాంగ్రెస్‌ నేతల ఆరోపణలు అబద్దమా?

`అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన విచారణ బుట్టదాఖలేనా?

`మంత్రి తుమ్మల మాటలకు విలువ లేదా?

`అవినీతి జరిగిన విషయం దృష్టికొచ్చిందన్న మాటలు అబద్దాలా!

`ప్రజా ప్రభుత్వంలో మంత్రికన్నా కమీషనరే పవర్‌ ఫుల్లా!

`విచారణ జరిపిస్తామని మంత్రి చెప్పిన వెంటనే శైలజా రామయ్య ఎందుకొచ్చారు?

`మళ్ళీ శైలజా రామయ్యను ఎందుకు తెచ్చి పెట్టారు?

`ప్రతిపక్షంలో వున్నప్పుడు ప్రశ్నలా?

`ఇప్పుడు అవినీతి అధికారులకే పెద్ద పీటలా?

`అవినీతి చేసిన వారికి అందలాల!

`ప్రభుత్వ ఆదేశాలు అమలు చేసిన వారికి కష్టాలా?

హైదరాబాద్‌,నేటిధాత్రి:

రాష్ట్ర ప్రభుత్వంలోని కొన్ని వ్యవస్దలకు ఏం మాయ రోగమొచ్చింది. చేస్తున్న ఉద్యోగాలకు నెల నెల వేలాదిరూపాయల జీతాలు తీసుకుంటూనే వున్నారు. అయినా అవినీతి అవతారం ఎత్తుతున్నారు. లంచాలు తీసుకోవడం తమ హక్కు అన్నంతగా మారిపోతున్నారు. ప్రజల సొమ్ముతినడం అన్యాయమని అనిపించదు. ప్రభుత్వ సొమ్ము అప్పనంగా తినడం అక్రమని అనిపించదు. కాని వేలెత్తి చూపితే మాత్రం ఎక్కడలేని పౌరుషం పొడుచుకొస్తుంది. అవినీతి జరిగిందని చెబితే ఆక్రోషమొస్తుంది. అన్యాయం జరుగుతుందని అంటే కోపాలొస్తాయి. ప్రజల సేవ కోసం వున్న, ప్రజల పన్నుల మీద జీతాలు తీసుకుంటున్న వాళ్లు అవినీతికి పాల్పడమమే నేరం. ఆ సంగతి తెలిసి కూడా అన్యాయానికి తెగబడతాం…అవినీతిని విచ్చలవిడిగా చేస్తాం..అవకాశాన్ని బట్టి కోట్లు మింగేస్తామనుకుంటున్నారు. మింగుతున్నారు కూడా.. సహజంగా ఎక్కడైనా ఒకప్పుడు అవినీతి అధికారి అని ఎక్కడ ముద్రపడుతుందో అని భయపడేవారు. ఉద్యోగ విధినిర్వహణ కర్తవ్యంగా సాగించేవారు. కాని ఇప్పుడు అందిన కాడికి దోచుకుంటేనే గొప్ప అన్నట్లు మారిపోయింది. అలాంటి వారికి జేజేలు పలుకుతున్నారు. వారికే అటు ప్రజలు, ఇటు తోటి ఉద్యోగులు భయపడుతున్నారు. నేటిధాత్రి ఇటీవల చేనేతలో చేతి వాటం అనే శీర్షికతో ఓ కథనం ప్రచురించింది. ఆ కథనం తప్పైతే ఆ అధికారులు వార్తలను ఖండిరచొచ్చు. నిజానిజాలు వెల్లడిరచి వార్తను తప్పు పట్టొచ్చు. కాని ఒక ఉన్నతోద్యోగి దేవత అంటూ కింది స్దాయి ఉద్యోగులు కీర్తించడం ఎక్కడా విన్నది లేదు. చూసింది లేదు. ఒక ఉన్నతాధికారి ఎలా దేవత అవుతుందో తెలియదు. వ్యక్తిగతంగా ఉన్నతోద్యోగి మీద గౌరవం వుంటే అలా సంబోధించుకోవడానికి అభ్యంతరం లేదు. కాని అది కార్యాలయంలో ఉన్నతోద్యోగి అయిన ఆ దేవత మీద వార్తలు రాస్తారా? అంటూ చిందులు తొక్కే కింది స్ధాయి ఉద్యోగులు కూడా వుంటారని ఎక్కడా వినలేదు. కాని ఇప్పుడు వింటున్నాం.. చూస్తున్నాం..చేనేత .జౌళి శాఖ కమీషనర్‌గా వున్న శైలాజా రామయ్యను దేవతగా కీర్తిస్తూ కార్యాలయంలోని ఉద్యోగులు ఆమె కాళ్లు కడిగి నెత్తిన చల్లుకున్న వార్త రాయించిన వాళ్ల పాపం పోదని నిందిస్తున్నారని విశ్వసనీయ సమాచారం. అంతే కాదు వార్త రాసిన నేటిధాత్రికూడా ఆ పనిచేయాలని ఓ సుధాకర్‌ రెడ్డి అనే ఉద్యోగి ఇతర ఉద్యోగుల మీద చిందులు వేశాడట. కారణం ఆ ఉద్యోగి కూతురుకు ఎలాంటి నోటిఫికేషన్‌ అవసరంలేకుండానే టెస్కొలో కమీషనర్‌ శైలజా రామయ్య ఆశీస్సులతో ఉద్యోగం కల్పించారు. ఆ కృతజ్ఞత వుంటే వ్యక్తిగతంగా పూజించుకోవచ్చు. కాని టెస్కొలో ఎలాంటి ఉద్యగమైనా నియామకాల మార్గదర్శకాలను అనుసరించి ఉద్యోగం కల్పించాలి. కాని అది జరగలేదు. తన కూతురుకు అప్పనంగా ఉద్యోగం సంపాదించుకున్నామన్న బెరుకులేదు. మీడియాకు తెలిస్తే ఇబ్బంది అవుతుందన్న భయం లేదు. నిరుద్యోగులకు తెలిస్తే అలా ఉద్యోగం ఎలా కల్పిస్తారంటూ ప్రశ్నిస్తారన్న ఆందోళన అసలే లేదు. తప్పు చేసి, ప్రభుత్వాన్ని మోసం చేశారు. ఒక రకంగా నేరం చేశారు. అయినా ఉన్నతాధికారి ఐఎఎస్‌ అదికారి అండగా వున్నారన్న ఆలోచనతో ఒక ఉద్యోగి తోటి ఉద్యోగుల మీద చిందులు తొక్కుతున్నాడని తెలిసింది. ఇక ఇదిలా వుంటే టెస్కొలో అవినీతి జరిగిందనే వార్తలు అనేకం వున్నాయి. ఇప్పుడు అదికారంలో వున్న కాంగ్రెస్‌ నేతలు చేసిన అనేక ఆరోపణలున్నాయి. ఆనాడు అవి తప్పని కమీషనర్‌ నోరు విప్పలేదు. తప్పు జరగలేదని చెప్పలేదు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి తుమ్మల టెస్కొలో నిధులు గోల్‌ మాల్‌ అయిన సంగతి స్వయంగా ఆయనే మీడియాకు వెల్లడిరచారు. అంటే ఇక్కడ మంత్రి చేసిన వ్యాఖ్యలు తప్పా? ఆయన జరిగిన దానిపై తప్పకుండా విచారణ చేపడతామని చెప్పడం అబద్దమా? దాంతో టెస్కొ విషయంలో మంత్రి మాటలకే చెల్లుబాటు లేకుండాపోయిందా? ఎవరు సమాదానం చెబుతారు? సాక్ష్యాత్తు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు టెస్కొలో బోగస్‌ సహకార సంఘాలున్నట్లు గుర్తించినట్లు కూడాచెప్పారు. అసలు వాటి గుట్టు రట్టు కావాల్సిన అవసరం వుంది. ఇక పోతే గత ప్రభుత్వమే టెస్కొలో ఏదో జరిగింది. కోట్ల రూపాయల గోల్‌ మాల్‌ కనిపిస్తుందని అనుమాన పడి అప్పటి మంత్రి కేటిఆర్‌ కమీషనర్‌ శైలాజా రామయ్యను బదిలీ చేశారు. ఆ స్దానంలో ఐఏఎస్‌ అధికారి బుద్ధ ప్రకాష్‌ను కమీషనర్‌గా నియమించారు.కొంతకాలం తర్వాత బుద్ధ ప్రకాష్‌ ను వేరే శాఖకు కేటీఆర్‌ బదిలీ చేసి టెస్కో కమీషనర్‌ గా అలుగు వర్షీణీని నియమించారు. ఆ తర్వాత జరిగిన తంతు గురించి ఆమె విచారణ మొదలు పెట్టింది. దాంతో టెస్కొలో విస్తుపోయే అంశాలు ఆమె దృష్టికి వచ్చాయి. వీటిలో లెక్కలు తేల్చాలంటే నిజాయితీ అధికారులుగా పేరున్న కొంత మందిని ఆమె తనశాఖలోకి తీసుకున్నారు. వారిలో కిరణ్మయి, క్రిష్ణప్రసాద్‌, కళావతి, మధు అనే ఉద్యోగులున్నారు. వీరి సహాకారంలో అలుగు వర్షిణి విచారణ మొదలు పెట్టింది. టెస్కోలో జరిగిన అవకతవకలు తన విచారణలో తెలిసిన వెంటనే లోతైన అధ్యయనం చేసే ముందు ఓసారి ప్రిన్సిపల్‌ సెక్రెటరీ జయేష్‌ రంజన్‌కు లేఖ రాశారు. ఆయన విజిలేన్స్‌ విచారణ జరపాలంటూ జీఏడికి సూచించారు. లోతైన విచారణ మొదలైంది. ఇంతలో ప్రభుత్వం మారింది. కొత్త ప్రభుత్వం కూడా విచారణ వేగవంతం చేయాలనే చూసింది. ఇంతలో టెస్కొలో జరిగిన అవినీతి బైటకు వస్తుందన్న ఆలోచనతో ఇతర శాఖలు చూస్తున్న శైలాజా రామయ్య పట్టుబట్టి మళ్లీ చేనేత జౌళి శాఖ కమీషనర్‌గా వచ్చారు. కమీషనర్‌గా వున్న ఐఏఎస్‌ అలుగు వర్షిణిని గురుకులకు పంపించారు. తర్వాత ఇతర ఉద్యోగుల మీద శైలాజా రామయ్య తమ ప్రతాపంచూపారు. తనపైనే విచారణ చేస్తారా? అని వచ్చిన వెంటనే కిరణ్మయిని గురుకుల శాఖకు పంపించారు. కృష్ణ ప్రసాద్‌ను తిరిగి పంపించేశారు. ఆయనకు రెండు నెలల్లో 35 మెమోలు, 8 చార్జిమెమోలు జారీ చేసి వేదిస్తున్నారని తెలుస్తోంది. ఒక కలావతి అనే ఉద్యోగికి నాలుగు నెలల నుంచి జీతం ఆపేశారు. ప్రభుత్వ ఆదేశాలు అమలు చేసినందుకు వీరికి కష్టాలు మొదలయ్యాయి. వేదింపులు మొదలయ్యాయి. నాలుగు నెలలుగా జీతం రావడం లేదని శైలజా రామయ్య ముందు కళావతి బోరున విలపించినా ఆమె కనికరించలేదు! ఉదయం నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు కార్యాలయం ముందు వేచి వుంచి, చివరికి నా దగ్గరకు రావొద్దని హెచ్చారించారు. ఇకమధు అనే ఔటోర్సింగ్‌ ఉద్యోగి విషయంలో మరీ విచిత్రం చేశారు. ఔట్‌సోర్సింగ్‌ ఏజేన్సీకి మధు అనే ఉద్యోగి రాజీనామా చేశారని లెటర్‌ పంపించారు. ఆఫీసులోనే అతన్ని తీసేశామంటూ ఉత్తర్వులు జారీ చేశారు. జూలై 19న ఉత్తర్వులు తయారు చేసి, జూలై 27 వరకు మధుకు సమాచారం ఇవ్వలేదు. ఇదిలా వుంటే ఈ ఉద్యోగులకు వేధింపులు ఆగాలన్నా, వారి వారి కొలువులు సజావుగా చేసుకోవాలనుకుంటే శైలజా రామయ్య మీద అప్పటి కమీషనర్‌ అలుగు వర్షిణి మా మీద ఒత్తిడి తెచ్చి నివేదికలు తయారు చేయించిందని ప్రభుత్వానికి లెటర్లు రాయాలి? అందులో మా తప్పేంలేదని అప్పటి కమీషనర్‌ ఒత్తిడి మేరకు చేశామని ఒప్పుకోవాలి. శైలజా రామాయ్య కాళ్లు కడిగి నెత్తిన పోసుకుంటే కూడా మీరు చేసిన పాపం పోదని హెచ్చరిస్తున్నారు. వారిని బెదిరిస్తున్నారు. ఇదిలా వుంటే ఏ ఉద్యోగుల మూలంగా టెస్కొలో అవినీతి జరిగిందన్న ఆరోపణలున్నాయో ఆ ఉద్యోగులైన రఘునందన్‌ రావును అప్పట్లో బదిలీ చేశారు. ఆయనతోపాటు తత్వానంద చారి, కలింగరెడ్డి, సుధాకర్‌రెడ్డి, పురాణం శ్రీనివాస్‌ను బదిలీ చేశారు. ఎప్పుడైతే శైలజా రామయ్య మళ్లీ చార్జి తీసుకున్న వెంటనే రఘనందన్‌ రావుకు పోస్టింగ్‌ వచ్చింది. ˜తత్వానంద చారికి డివో నుంచి ఏడి అయ్యారు. కళింగ రెడ్డి డివో నుంచి ఏడి అయ్యారు. సస్పెండ్‌ అయిన పురాణం శ్రీనివాస్‌కు ఎంవో నుంచి లివరీ డివిజన్‌కు ప్రమోషన్‌ ఇచ్చారు. ఇలా టెస్కొలో అవినీతికి పాల్పడినట్లు ప్రాధమిక విచారణలో తేలిన వారికి ఇప్పుడు ప్రమోషన్లు వచ్చాయి. ప్రభుత్వం విచారణ కోసం తీసుకున్న టీమ్‌ ఉద్యోగులకు మాత్రం బదిలీలు, ఒత్తిళ్లు, వేధింపులు, జీతాలు ఆపడాలు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి మధుకు ఉద్యోగమే లేకుండా చేశారు. ఇదంతా నిజమా? కాదా? అన్నది కమీషనర్‌ చెప్పాలి. లేకుంటే అసలు టెస్కొలోఎలాంటి అవకతవకలు జరగలేదని ప్రభుత్వంతో చెప్పించాలి. కింది స్దాయి ఉద్యోగులను వేధిస్తే తప్పు ఒప్పు కాదు. జరిగిన అవినీతి లెక్కలోకి రాకుండాపోదు. నేటిధాత్రి మీద నిందలేస్తే సరిపోదు. ఆరోపణలు నిజం కాదని నిరూపించుకోవాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!