గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి :
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి రైతుకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ ఎలాంటి ఆంక్షలు లేకుండా చెయ్యాలని, కొత్త రుణాలు మంజూరు చేయాలని అఖిల భారత రైతు కూలీ సంఘం (ఏఐకేఎంఎస్) మండల అధ్యక్షులు బచ్చల సారన్న డిమాండ్ చేశారు. గురువారం గుండాల మండల కేంద్రంలో జరిగిన అఖిల భారత రైతు కూలీ సంఘం (ఏ ఐ కే ఎం ఎస్) మండల కమిటీ సమావేశంలో తను మాట్లాడుతూ ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం అనేక వాగ్దానాలు చేసిందని ఈ వాగ్దానాలు అమలు చేయడంలో విఫలం అయిందని ఆరోపించారు. వర్షకాలం ప్రారంభమై నాలుగు నెలలు అవుతున్నప్పటికీ రైతు భరోసా రైతుల ఖాతాలో వేయకపోవడంతో రైతులకు పెట్టుబడికి డబ్బులు లేక ప్రైవేట్ వ్యాపారస్తులని ఆశ్రయించాల్సి వచ్చిందని రైతు భరోసా పథకం ద్వారా వెంటనే ఎకరాకు 7500 రూపాయలు రైతు ఖాతాలో వేయాలని డిమాండ్ చేశారు. రైతు రుణమాఫీ పథకం నత్త నడకన నడుస్తుందని తక్షణం రెండు లక్షల రూపాయలు తీసుకున్న రైతులకు కూడా రుణమాఫీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈనెల మొదటి వారంలో కురిసిన భారీ వర్షాల మూలంగా రాష్ట్రవ్యాప్తంగా పంట నష్టపోయిన రైతులకు మొక్కజొన్న, వరి పంటకు 50 వేల రూపాయలు, మిర్చి పత్తి పంటలకు లక్ష రూపాయలు ఎక్స్గ్రేషన్ చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత రైతు కూలి సంఘం ఏఐకేఎంఎస్ నాయకులు జిల్లా నాయకులు కొమరం సీతారాములు, గడ్డం లాలయ్య, మరియు మండల నాయకులు ఈసం మంగన్న, పాయం ఎల్లన్న, కల్తీ మల్లన్న, వాగబోయిన సుందర్రావు, పర్షిక పొట్టయ్య, గోగ్గల సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.