నల్లగొండ జిల్లా, నేటి ధాత్రి :
మునుగోడు నియోజకవర్గం లోని ప్రతి గ్రామానికి పల్లె వెలుగులు బస్సులు నడిపించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు బండ శ్రీశైలం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు . మంగళవారం మండలంలోని గూడపూర్ , కొరటికల్ గ్రామాలలో నిర్వహించిన గ్రామ శాఖ మహాసభలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మునుగోడు నియోజకవర్గం లో గ్రామానికి మధ్య ఉన్న రోడ్లు గుంతల మయంగా మారడంతో రోడ్ల వెంట ప్రయాణం చేయడానికి అంతరాయం గా ఆ రోడ్ల నిర్మాణం కు నిధులు కేటాయించి రోడ్లను మరమదులు చేయించాలని సూచించారు . నియోజవర్గంలోని అన్ని గ్రామాలకు మురికి కాల్వ నిర్మాణం , సీసీ రోడ్ల నిర్మాణం అర్హులైన లబ్ధిదారులకు ఇంటి నిర్మాణం కు 5 లక్షలు , అర్హులైన వికలాంగులకు వితంతువులకు వృద్ధులకు అనాధ కుటుంబాలకు పింఛన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. విజయదశమి దృష్టిలో అధికారులు గ్రామాలలో వీధిలైట్లను ఏర్పాటు చేయాలని కోరారు. సీజనల్ వ్యాధుల బారిన పడిన ప్రజలకు వైద్యం అందుబాటులో ఉంచి నాణ్యమైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. రైతు పండించిన పంటకు మద్ద ధర అనేందుకు సిసిఐ , ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరారు. పత్తి క్వింటలకు 12,500 వరి ధాన్యముకు 2850 మద్దతు ధర ప్రతి పంటకు 1000 రూపాయల బోనస్ ఇవ్వాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు . ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి మిర్యాల భరత్ , మండల కమిటీ సభ్యులు వేముల లింగస్వామి ,గూడపూర్ గ్రామ కార్యదర్శి పగడాల కాంతయ్య , కొరటికల్ గ్రామ కార్యదర్శి బోడిసె శివ , కట్ట కల్వకుంట్ల గ్రామ కార్యదర్శి పగిళ్ల మధు , పలివెల గ్రామ కార్యదర్శి పూల శ్రీను , కల్వలపల్లి గ్రామ కార్యదర్శి ఒంటెపాక అయోధ్య , కిష్టాపురం గ్రామ కార్యదర్శి పర్సనబోయిన లింగస్వామి , చల్మడ గ్రామ కార్యదర్శి కొంక రాజయ్య , కొంపెల్లి గ్రామ కార్యదర్శి పగిళ్ల సైదులు తదితరులు పాల్గొన్నారు.