క్లూస్ టీమ్ తో ఆధారాలు సేకరించిన పోలీసులు.
జమ్మికుంట: నేటి రాత్రి
వీణవంక కేంద్రంలో ఆదివారం అర్ధరాత్రి వరుస దొంగతనాలతో వీణవంక గ్రామ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తుంది. మండల కేంద్రంలోని వెంకటరమణ ఎలక్ట్రికల్స్, నల్ల పోచమ్మ వైన్స్ లో వరుస చోరీలు జరగగా, వెంకటరమణ ఎలక్ట్రికల్స్ లోని షేటర్ ను గడ్డపార సహాయంతో పైకి లేపి, షాపులోని బయట సీసీ కెమెరాలను, కట్ చేసి, సీసీ కెమెరా ల హార్డ్ డెస్క్ ను 15వేల రూపాయలను చోరీ చేశారని, షాప్ యజమాని కాసనగట్టు వెంకటరమణ ఆవేదన వ్యక్తపరిచారు. నల్ల పోచమ్మ వైన్స్ లో కిటికీ కింది నుండి సిమెంట్ గోడలను తొలగించి, అందులో నుండి షాపులకు ప్రవేశించి సీసీ కెమెరాలను కట్ చేసి, హార్డ్ డిస్క్ , 31 వేలరూపాయలను, 85 వేల విలువగల మద్యం బాటిల్లను ఎత్తుకెళ్లారని, షాప్ యజమానులు ఆవేదన వ్యక్తపరిచారు. ఈ చోరీ విషయంపై వీణవంక ఎస్సై తోట తిరుపతికి ఫిర్యాదు చేయగా , వెంటనే స్పందించి క్లూస్ టీం ను రప్పించి, ఆధారాలు సేకరించి విచారణ చేపడుతున్నారు.