జైపూర్, నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని ఖాసింపల్లి, ఇందారం గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 53 ట్రాక్టర్ ట్రిప్పుల ఇసుక కుప్పలను రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు. జైపూర్ మండల ప్రజలు ఎవరైనా అక్రమంగా ఇసుక తరలింపు చేసిన ఇసుక నిల్వ చేసినట్లయితే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, పదేపదే ఇలాంటి చర్యలకు పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతుందని, ప్రజలు కూడా తమకు అక్రమ ఇసుక రవాణా కార్యకలాపాలు జరిగినట్లయితే సమాచారం అందించాలని, అధికారులకు సహకరించాలని తహసిల్దార్ వనజ రెడ్డి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జైపూర్ ఎమ్మార్వో వనజ రెడ్డి, గిరిధవర్ తిరుపతి, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.