
కాశిబుగ్గ నేటిధాత్రి.
శనివారం గాంధీభవన్ లో కాంగ్రెస్ పార్టీ నూతన రధసారధి మహేష్ కుమార్ గౌడ్ మరియు రాష్ట్ర ఇంచార్జ్ దీపాదాస్ మున్సి నేత్రత్వంలో వరంగల్ ఉమ్మడి జిల్లా సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో వరంగల్ తూర్పు నియోజకవర్గం నుండి వెళ్లిన నాయకులు కార్యకర్తలు రాష్ట్ర మంత్రి, తూర్పు శాసన సభ్యులు కొండా సురేఖ ఆధ్వర్యంలో టీ పీసీసీ మహేష్ కుమార్ గౌడ్,దీపాదాస్ మున్సీ కలవడం జరిగింది.మహేష్ కుమార్ గౌడ్ ను వరంగల్ తూర్పు నియోజకవర్గం తరుపున శాలువా కప్పి బొకే తో శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నవీన్ రాజు,మొహమ్మద్ అయూబ్,మీసాల ప్రకాష్, కొత్తపల్లి శ్రీను, మడిపల్లి కృష్ణ, కార్పొరేటర్లు మరియు ముఖ్య నాయకులు పాల్గొన్నారు