భద్రాచలం నేటి ధాత్రి
భద్రాచలం సిటీ స్టైల్ జిమ్ కోచ్ జివి రామిరెడ్డి.
ఆగస్టు 31న జరిగిన తెలంగాణ రాష్ట్ర స్థాయి బెంచ్ ప్రెస్ పోటీలలో 74 కేజీల విభాగంలో భద్రాచలం సిటీ స్టైల్ జమ్ కు చెందిన డాక్టర్ శివరామకృష్ణ ప్రసాద్ కాంస్య పతకం సాధించడం జరిగింది. ఆగస్టు 7వ తేదీన రంగారెడ్డి జిల్లాలో జరిగిన రాష్ట్రస్థాయి జావలిన్ త్రో పోటీలలో ఎస్.కె.అమ్రిన్ బంగారు పతకం సాధించింది. ఈ పతకాలు సాధించిన ఇద్దరిని, భద్రాచలం ఏఎస్పీ అంకిత్ కుమార్ అభినందించడం జరిగింది. ఎస్.కె.అమ్రిన్ గతంలో జిల్లాస్థాయి జావలిన్ త్రో లో,15 పతకాలు మరియు రాష్ట్రస్థాయిలో 8 పతకాలు సాధించడం జరిగింది. వచ్చే నెల అక్టోబర్ 19 20 తారీకులలో గుంటూరులో జరిగే జాతీయస్థాయి జావలిన్ త్రో పోటీలకు ఎంపికైనట్లు తెలిపారు.ఇటీవల ప్రమాదంలో గాయపడి ప్రాణాపాయ స్థితిలో వచ్చిన కాన్స్టేబులల్స్ కి ప్రధమ చికిత్స చేసినందుకు డాక్టర్ గారిని కూడా ప్రత్యేకంగా అభినందించారు.ఈ సందర్భంగా ఏఎస్పీ అంకిత్ కుమార్ మాట్లాడుతూ, క్రీడలు శరీర దారుఢ్యాన్ని ఇవ్వడమే కాకుండా, మానసిక ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, సోదర భావాన్ని స్నేహభావాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. క్రీడల్లో రాణించి రాష్ట్రానికి దేశానికి మంచి పేరు తీసుకురావాలని తెలిపారు. ఈ గెలుపొందిన క్రీడాకారులను పట్టణంలోని,ప్రముఖులు, క్రీడా సంఘాల నాయకులు, రాజకీయ నాయకులు, గ్రీన్ భద్రాద్రి సభ్యులు, పట్టణ ప్రముఖ సంఘ సేవకులు గాదె మాధవరెడ్డి తదితరులు అభినందించారు.