ఘనంగా ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి

సిరిసిల్ల(నేటి ధాత్రి):

శనివారం ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి కార్యక్రమాలలో పురపాలక సంఘం అధ్యక్షురాలు జిందం కళా – చక్రపాణి ముఖ్య అతిథులుగా హాజరై ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ కి ఘన నివాళులర్పించారు.
ఈ సందర్భంగా పురపాలక సంఘం అధ్యక్షురాలు జిందం కళా – చక్రపాణి మాట్లాడుతూ…
ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ నాటి భారత స్వతంత్ర ఉద్యమంలో మహాత్మా గాంధీజీ తో కలిసి పోరాడారు. అదేవిధంగా తెలంగాణ ప్రాంతంకి జరుగుతున్న అన్యాయంపై ఎదిరించి నాటి సాయుధ పోరాటం నుండి తెలంగాణ తొలి మలిదశ ఉద్యమలలో తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మ నుండి కెసిఆర్ వరకు అలాగే ఎంతో మంది ఉద్యమకారులకు సహాయ సహకారాలు అందించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో తనదైన ముద్ర వేశారు..
ఈ క్రమంలో మొట్టమొదటిగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం తన మంత్రి పదవికి కూడ రాజీనామా చేసిన మహోన్నత వ్యక్తి మార్గదర్శకుడు ఆచార్యకొండ లక్ష్మణ్ బాపూజీ అని అన్నారు..
ఇలా అన్ని వర్గాల కులాల ఐక్యత కోసం సంక్షేమం కోసం కృషి చేసిన పద్మశాలి ముద్దుబిడ్డ కొండ లక్ష్మణ్ బాపూజీ సేవలను గౌరవిస్తూ
ఈరోజు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా సిరిసిల్ల పట్టణంలోని పద్మశాలి కుల బాంధవులతో పాటుగా అన్ని వర్గాల కులాల పెద్దలతో నాయకులతో కలిసి ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ కి పూలమాలలతో ఘన నివాళులర్పించడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తూ వారి ఆశయాలను కొనసాగించేలా సమాజం ముందుకు సాగాలని కోరుకుంటున్నాం అని ఈ సందర్బంగా అన్నారు..
ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షులు గాజుల బాలయ్య, సిరిసిల్ల శాఖ అధ్యక్షులు గోలి వెంకటరమణ, మున్సిపల్ వైస్ చైర్మన్ మంచె శ్రీనివాస్, కౌన్సిలర్ సభ్యులు, కోఆప్షన్ సభ్యులు ఇతర ప్రజాప్రతినిధులు, గూడూరి ప్రవీణ్,తోట ఆగయ్య,
జిందం చక్రపాణి,బొల్లి రామ్మోహన్, కాముని వనిత,డా. గాజుల బాలయ్య, గోనె ఎల్లప్ప, చొప్పదండి ప్రకాష్, నాగుల శ్రీనివాస్, మొదలగు రాజకీయ పార్టీల నాయకులు, వివిధ కుల సంఘాల నాయకులు, పద్మశాలి కుల బాంధవులు మొదలగు వారు పాల్గొని ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను కొనసాగించాలని నినాదాలు చేస్తూ పూలమాలలతో వారికి ఘన నివాళులర్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!