రిజిస్ట్రేషన్ అయినా రైతులకుపట్టా బుక్కులు ఇవ్వడం లేదు

జిల్లా అధికారులు విఫలం

సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి మారపెల్లి మల్లేష్

భూపాలపల్లి నేటిధాత్రి

టేకుమట్ల మండల కేంద్రంలో సిపిఐ ఎంఎల్ జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లేష్ ప్రెస్ మీట్ నిర్వహించారు అనంతరం మాట్లాడుతూ రైతులు జిల్లావ్యాప్తంగా అన్ని మండలాల్లో రిజిస్ట్రేషన్ చేసుకుని పట్టా బుక్కులు రాక మూడు నెలల నుండి ఎదురుచూస్తున్నారు పోస్ట్ ఆఫీస్ ద్వారా వస్తాయిఅని చెప్పేసి అంటున్న అధికారులు ఇప్పటివరకు ఎక్కడ ఏ పోస్ట్ ఆఫీస్ లో కూడా వచ్చిన దాకాలు కానరావడం లేదు రైతులు ఆశతో బ్యాంకు రుణాల కోసం ఎదురుచూస్తున్నారు వన్ బి తీసుకపోతే బ్యాంకు వాళ్ళు రుణాలు ఇవ్వడం లేదు పట్టా బుక్కు ఉంటే ఇస్తామని తేల్చి చెప్పిస్తున్నారు తక్షణమే పట్టా బుక్కులు అందించాలని జిల్లా రెవెన్యూ అధికారులను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ధరణిలో మార్పులు చేస్తామని అన్న ప్రభుత్వం చేయడంలో నిర్లక్ష్యం చేస్తా ఉంది సన్న చిన్న కారు రైతుల భూములు పట్టాలు గాక కొన్ని సంవత్సరాలుగా భూమిలో కాస్తులో ఉంటున్నారు కానీ ఉన్న వారి పేరు మీద పాని నకల్లో ఆ సర్వే నెంబర్లో భూములు ఉండడం లేదు వేరే వారి పేరు మీద ఉంటున్నాయి మా భూములకు పట్టాలు కావాలని గత ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించిన పట్టించుకున్న దాఖలు లేదు ఈ ప్రభుత్వమైనా మళ్లీ సాదా బైనామ తీసుకొచ్చి పట్టాలిస్తాదని ఆశతో ఎదురుచూస్తున్నారు కానీ ప్రభుత్వం ఒక్క అడుగు కూడా ముందుకు వేయడం లేదు అసైన్మెంట్ భూములు దున్నుకుంటున్న వారు పట్టాలకు నోస్కున్న దాఖలు లేవు పట్టాదారు చనిపోతే వారి వారసత్వానికి పట్టాలు చేసే పరిస్థితి లేదు రెవిన్యూ చట్టం సవరణ చేసి ఈ సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం జిల్లా కమిటీ సభ్యులు కసర వేణి కుమార్ సాదా శ్రీనివాస్ ప్రకాష్ పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!