గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి :
కొమరం భీమ్ ఆసిఫాబాద్ జైనూరు మండల కేంద్రానికి చెందిన ఆదివాసి మహిళా పైన ఎస్కే ముద్దాం అత్యాచారం చేసి హత్య ప్రయత్నం చేసిన వ్యక్తి పైన కేసు నమోదు చేసి విచారణ చేసి ఫస్ట్ స్టాక్ కోర్టు ద్వారా ఆరు నెలల లోపు అతనినీ బహిరంగంగ ఉరిశిక్ష విధించాలని ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ రాష్ట్ర కో కన్వీనర్ కోడెం వెంకటేశ్వర్లు డిమాండ్ చేస్తూ అదేవిధంగా నేడు బంద్ పాటించాలని రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు తుడుం దెబ్బ రాష్ట్ర కమిటీ తీర్మానం చేశారు.ఆదివాసి మహిళల పైన అగుత్యాలకు పాల్పడుతున్న ఇలాంటి వ్యక్తులకి అత్యాచారానికి పాల్పడకుండా ఉండాలంటే వీరికి బహిరంగంగా ఉరిశిక్ష విధించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా అన్ని వర్గాల వ్యాపారస్తులు అలాగే ఆర్టీసీ బస్సులు వివిధ ట్రాన్స్పోర్ట్ లారీలు ఆటోలు కార్మికులు కర్షకులు ప్రజలు ప్రజాస్వామ్యవాదులు అత్యాచారాన్ని గురైన మహిళకి సహాయ సహకారలు అందిస్తూ బందు పాటించాలని అదేవిధంగా ఆదివాసి ఉద్యమానికి ఆదివాసీలు ఎస్సీలు,బీసీలు, ఓసీలు,మైనార్టీలు అందరూ భాగస్వాములై బంద్ పాటించాలని కోరారు.