
కల్నల్ సెంథిల్ రామాదురై
మొగుళ్లపల్లి నేటి ధాత్రి :
మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ మొగుళ్లపల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎన్ సి సి యూనిట్ ను పదవ తెలంగాణ బెటాలియన్ వరంగల్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ సెంథిల్ రామాదురై సందర్శించి. ఎన్సిసి శిక్షణకు కావలసిన మౌలిక సదుపాయాలు నిర్వహించాల్సినటువంటి రిజిస్టర్లు, రికార్డులను తనిఖీ చేశారు, విలువైన సూచనలు చేసి ప్రధానోపాధ్యాయుడు. ఎన్సిసి అధికారి గుండెల్లి రాజయ్యను అభినందించారు.
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో. ఎన్ సిసి విద్యార్థులతో మాట్లాడుతూ. ఎన్సిసి తో విద్యార్థిని విద్యార్థులకు, క్రమశిక్షణ దేశభక్తి, సోదర భావం, నాయకత్వ లక్షణాలు, శారీరక మానసిక ఆధ్యాత్మిక , జీవన విలువలతో కూడిన అంశాలను రెండు సంవత్సరాలలో శిక్షణ ఇస్తారు. వీటితోపాటు డ్రిల్లు ఆయుధ వినియోగం, ఆర్మీ జీవితం ఎలా ఉంటుందో, శిక్షణ ఇస్తారు, వీటితోపాటు ఏ సర్టిఫికెట్ యొక్క ఉపయోగాలను విద్యార్థిని విద్యార్థులకు వివరించారు. పై చదువులకు విద్య ఉద్యోగాలలో రిజర్వేషన్ ఉపయోగపడుతుందని సూచించారు.
ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు పింగిలి విజయ్ పాల్ రెడ్డి, ఉపాధ్యాయ బృందం ఎన్సిసి విద్యార్థులతో కమాండింగ్ ఆఫీసర్ ను శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు భాగ్యశ్రీ, వెంకన్న, సురేందర్, కళ్యాణి, అనిల్ కుమార్, రాజు, కుమారస్వామి, ప్రవీణ్, లలిత, పద్మ, విజయ భాస్కర్, శ్రీకళ, చందర్, స్పందన, అటెండర్ మజార్ బెటాలియన్ అధికారి. ప్రేమ్ శంకర్ సౌరస్య ఎన్సిసి విద్యార్థులు పాల్గొన్నారు.