*రైతులు మారుతున్న సమయానుగుణంగా మారాలి గండ్ర*

*పామాయిల్ సాగు పరిశీలించడానికి ప్రత్యేక ఏర్పాట్లు*

*వేగవంతంగా డబల్ బెడ్రూమ్ ఇండ్లు పూర్తి అయ్యే విధంగా చర్యలు చేపట్టాలి*

*విద్యుత్ తాగునీటి సరఫరా శాఖలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం సర్పంచులు*

*అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలి గండ్ర*

*మత్స్య శాఖ ఉన్నత అధికారులు రాకపోవడంతో ఆగ్రహం*

*సమావేశంకు హాజరు కాని మైనింగ్ ఎక్సైజ్ ఆర్ అండ్ బి పలు శాఖల అధికారులు*

*చలి వాగు నీటిని విడుదల చేసిన దంపతులు*

శాయంపేట, నేటిధాత్రి: రైతులు మారుతున్న నవయుగానికి అనుగుణంగా మార్కెట్లో డిమాండ్ ఉన్న లాభసాటి పంటలు
వేసి సమానంగా మారాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి అన్నారు. శాయంపేట మండల కేంద్రంలోని మండల మహిళ సురేఖ సమైక్య కార్యాలయంలోని సమీక్ష సమావేశ భవనంలో ఏర్పాటు చేసిన మండల సర్వసభ్య సమావేశానికి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి వరంగల్ రూరల్ జిల్లా జడ్పీ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఎంపీపీ మెతుకు తిరుపతి రెడ్డి సభాధ్యక్షత వహించగా వ్యవసాయ, ఉద్యానవన, విద్య, పశు సంవర్ధక, ప్రజారోగ్యం, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్, ఇందిరా క్రాంతి, సాంఘిక సంక్షేమ, శిశు సంక్షేమ, పౌరసరఫరా, నీటిపారుదల ఆర్డబ్ల్యూఎస్,
విద్యుత్, మత్స్యశాఖ, ఈజీఎస్ శాఖల వారీగా సమీక్షించారు. గతంలో మాదిరిగానే ఈసారి కూడా మైనింగ్ ఎక్సైజ్ ఆర్ అండ్ బి పలు శాఖల అధికారులు సమావేశానికి హాజరు కాలేదు దీంతో ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలని ఎంపీడీవో
కృష్ణమూర్తికి ఎమ్మెల్యే సూచించారు. ఈ సందర్భంగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి మాట్లాడుతూ ఆహారపదార్థాల్లో ప్రజలు నిత్యం వినియోగించే నూనె ఉత్పత్తులను ఇతర దేశాల నుండి పెద్ద మొత్తంలో దిగుమతి చేసుకుంటున్నామని దీన్ని నివారించడానికి రైతులకు లాభాలు చేకూర్చాలని ప్రభుత్వం రాయితీలు కల్పిస్తూ పామ్ ఆయిల్ ఉత్పత్తి పెంచాలనే లక్ష్యంతో ప్రోత్సాహకాలు అందజేస్తోందని రైతులు పామాయిల్ సాగు చేసి లాభాలు పొందాలని అన్నారు. పక్కనే ఉన్న ఖమ్మం జిల్లాలోని అశ్వరావుపేటలో పామాయిల్ సాగు చేసి రైతులు లాభాలు అర్జీఇస్తున్నారని, పామాయిల్ సాగు పరిశీలించడానికి భూపాలపల్లి నియోజకవర్గంలో పామాయిల్ సాగు పై ఆసక్తి ఉన్న రైతులు సాగును పరిశీలించడానికి త్వరలోనే రైతులతో పర్యటన చేపట్టనున్నట్లు ఆసక్తి ఉన్న రైతులు పేర్లు నమోదు చేసుకోవాలని తెలిపారు. శాయంపేట
మండల కేంద్రానికి డబుల్ రోడ్డు పాలనాపరంగా అనుమతులు తీసుకుని మంజూరు అయిందని ఫిబ్రవరి మాసంలో టెండర్ ప్రక్రియ పూర్తి చేసుకుని పనులు ప్రారంభిస్తారని, ఆరేపల్లి రోడ్డు పనులు కూడా పూర్తి చేపడతామని ఇండ్లు కోల్పోతున్న నిర్వాసితులు సహకరించాలని ఇల్లు కోల్పోయిన వారికి ఇండ్లు కట్టిస్తామని, బాధితులు ముందే మంజూరు కాపీని అందజేయమనడం సరికాదని, శాయంపేట మండల కేంద్రంలో 110 డబల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మాణం చేపట్టి ఇండ్లు కోల్పోయిన వారికి నిరుపేదలకు అందజేయడానికి అందరూ సహకరించి పనులు చేపట్టాలని అన్నారు.

*వేగవంతంగా డబల్ బెడ్రూమ్ ఇండ్లు పూర్తి అయ్యే విధంగా చర్యలు చేపట్టాలి*

శాయంపేట మండలానికి 455 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు కాగా వాటి నిర్మాణం వేగవంతంగా పూర్తి చేయడానికి చర్యలు చేపట్టాలని గండ్ర దంపతులు సూచించారు. సాంక్షన్ అయిన గ్రామాలలో స్థలాన్ని పరిశీలించి ఈ మధ్య కాలంలోనే భూమి పూజ కార్యక్రమం నిర్వహించాలని ఆదేశించారు. శాయంపేట మండల కేంద్రంలో
నల్లకుంట చెరువు శిఖం భూమి ఉందని అధికారులు తెలపగా, అధికారులు ప్రజా ప్రతినిధులు కలిసి స్థలాన్ని పరిశీలించి భూమిని చదును చేయించి ఆరో తేదీన ఫౌండేషన్ వేయడానికి ఏర్పాట్లు చేయాలని సూచించారు.

*భూమి ఇవ్వమని సాగుచేస్తున్న బాధితుల నిరసన*

నిరుపేదల మైన మేము చెరువు శిఖం భూమిని సాగు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నామని ఆ భూమిని డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణానికి ఇవ్వబోమని సాగుచేస్తున్న బాధితులు సమావేశం అనంతరం గండ్ర దంపతుల దృష్టికి తీసుకు వచ్చారు. తాము సాగుచేసుకుంటున్న భూమిని ఇవ్వమని మరిఇతర ఏదైనా భూమిని పరిశీలించి డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం చేపట్టాలని కోరుతూ తమ గోడును గండ్ర దంపతుల దృష్టికి తీసుకువెళ్లారు. దళితులకు కేటాయించిన అసైన్డ్ భూములను వారి పేదరికాన్ని ఆసరాగా చేసుకుని పైసోపర్కో చెల్లించి లాక్కున్న భూములు చాలా ఉన్నాయని వాటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న కే పేదలు సాగు చేస్తున్న ఈ భూమిలోకి రావాలని బాధితులు అనడం గండ్ర దంపతులు నచ్చజెప్పే ప్రయత్నం చేసిన ఫలితం లేకపోవడంతో విషయం చేయి దాటకుండా పోలీస్ బందోబస్తు చేసిన శాయంపేట ఎస్ఐ ప్రవీణ్ కుమార్ నిరసనకారులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.

*విద్యుత్ తాగునీటి సరఫరా శాఖలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం సర్పంచులు*

రాష్ట్ర ప్రభుత్వం నిరంతరంగా విద్యుత్ తాగునీటి సౌకర్యానికి ప్రాధాన్యత ఇస్తున్న క్షేత్రస్థాయిలో
విద్యుత్ నీటి సరఫరా శాఖల అధికారుల నిర్లక్ష్యంతో విద్యుత్ కోతలు లీకేజీలతో సరైన నీటి సరఫరా లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని సర్పంచులు సభాముఖంగా అధికారులను నిలదీశారు. విద్యుత్ శాఖ అధికారులు ఆ కారణంగా కోతలు విధిస్తున్నారని వ్యవసాయ క్షేత్రాలలో విద్యుత్ సమస్యలు ఉన్నాయని ఏఈ అందుబాటులోకి రాడని పెద్దకొడపాక సర్పంచ్ అబూ ప్రకాష్ రెడ్డి అన్నారు. గట్లకనీపర్తి సూరంపేట గోవిందాపూర్ కొప్పుల గ్రామాలలో మిషన్ భగీరథ నీరు ట్యాంక్ లోకి ఎక్కడం లేదని సర్పంచులు రజిత, శ్రీనివాస్, సాంబయ్య, ఎంపీటీసీ శ్రీనివాస్ సభ దృష్టికి తీసుకువెళ్లగా ప్రభుత్వం ప్రతి ఇంటికి తాగునీటిని చేరవేయడానికి పెద్ద మొత్తంలో నిధులు కేటాయిస్తూ పనులు చేపట్టినప్పటికీ తాగునీటిని ఎందుకు సరఫరా చేయడం లేదని సమస్యను అతి త్వరగా పరిష్కరించాలని, వచ్చేది వేసవికాలంలో నీటి విద్యుత్ కొరత లేకుండా అధికారులు చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి సూచించారు. అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాలని అన్నారు.

*మత్స్య శాఖ ఉన్నత అధికారులు రాకపోవడంతో ఆగ్రహం*

మత్స్య సంపద పెంచడానికి ప్రభుత్వం చేస్తున్న కృషిని మత్స్య శాఖలో ఉన్న అవకాశాలను చేప పిల్లల పంపిణీ ఇతర విషయాలపై ఆరోపణలు వచ్చినా మత్స్యశాఖ అధికారులు తెలియజేయడం లేదని శాయంపేట సర్పంచ్ కందగట్ల రవి సభ దృష్టికి తీసుకువెళ్లగా, మత్స్య సంపదను పెంచి ప్రజలకు పౌష్టికాహారాన్ని అందజేయాలని ప్రభుత్వం మత్స్య శాఖలో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి మత్స్య సంపద పెంపొందించడానికి కృషి చేస్తుంటే మూడు మాసాలకు ఒకసారి నిర్వహించే సర్వసభ్య సమావేశంలో పథకాలు వివరించడానికి మత్స్య శాఖ అధికారులకు సమావేశానికి వచ్చే అంత సమయం లేదా అని గండ్ర వెంకటరమణా రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తూ చరవాణి ద్వారా మత్స్యశాఖ ఉన్నత అధికారులను ఆరా తీశారు. ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలని మత్స్య శాఖలో వస్తున్న ఆరోపణలు ప్రజాప్రతినిధులుగా ప్రభుత్వం చేస్తున్న పనులు ప్రజలకు వివరించే విధంగా సర్పంచులకు తెలియజేయాలని సూచించారు.

*చలి వాగు నీటిని విడుదల చేసిన దంపతులు*

యాసంగి పంట సాగుకు గానూ చలి వాగు ప్రాజెక్టు నీటిని విడుదల చేసిన దంపతులు. శాయంపేట నుండి చిట్యాల వరకు సాగునీరు
అందజేస్తూ తాగునీరు కూడా సమకూరుస్తున్న చలి వాగు ప్రాజెక్టు ఆధునీకరణ అభివృద్ధికి తొమ్మిది కోట్ల రూపాయలతో పనులు చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!