నల్లగొండ జిల్లా, నేటి ధాత్రి:
మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం 26,000 వేలుఇవ్వాలని సిఐటియు చండూరు మండల కన్వీనర్ జెర్రీపోతుల ధనంజయ గౌడ్ అన్నారు. శుక్రవారం చండూర్ మున్సిపల్ కార్యాలయం ముందు మున్సిపల్ కార్మికులతో కలిసి తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ ( సిఐటియు అనుబంధం ) ఆధ్వర్యంలోధర్నా నిర్వహించారు.అనంతరం మున్సిపల్ కమిషనర్ కు మెమోరండం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మున్సిపల్ కార్మికులనుపర్మినెంట్ చేయాలని, మున్సిపల్ కార్మికులకు ఎనిమిది గంటల పని విధానం అమలు చేయాలనిఆయన అన్నారు. మున్సిపల్ కార్మికులకు మూడు నెలల జీతాలు రావాలని, 11నెలల ఈఎస్ఐపిఎఫ్ రావడంలేదని వారి జీవితంలో మాత్రం అధికారులు కటింగ్ చేసుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.మున్సిపల్ కార్మికుల ఈఎస్ఐ, పీఎఫ్ డబ్బులు వారి ఖాతాలోనే జమ చేయాలని, జమ చేయని అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలనిఆయన అన్నారు. నిరుపేదలైన మున్సిపల్ కార్మికులందరికీ డబల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని, ఇండ్లు లేని వారికి ఇండ్ల స్థలాలు ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రమాదంలో మరణిస్తున్న కార్మికుల కుటుంబాలకు 25 లక్షల ఇన్సూరెన్స్ పథకాన్ని అమలు చేయాలనిఆయన ప్రభుత్వాన్ని కోరారు. మున్సిపల్ కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్,వివిధ రకాల మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేయాలని ఆయన అన్నారు.మున్సిపల్ కార్మికుల సమస్యలనుపరిష్కరించనియెడల మున్సిపల్ కార్మికుల ఆధ్వర్యంలో దశలవారీగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఆయన. హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు మోగుదాల వెంకటేశం, సిఐటియు సీనియర్ నాయకులు చిట్టిమల్ల లింగయ్య, తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ చండూర్ మున్సిపాలిటీ ప్రధాన కార్యదర్శికత్తుల సైదులు,ఉపాధ్యక్షులు, నల్లగంటి లింగస్వామి, బి పంగి నగేష్,పెద్ద వెంకన్న, ఇరిగి యాదయ్య,దనయ్య, సుధాకర్, శ్రీరాములు, చిన్న వెంకన్న, దుర్గయ్య,చిన్న రాజు,అలివేలు,చంద్రమ్మ, కలమ్మ, బక్కమ్మ,ముత్తమ్మ,రవమ్మ,అన్నేపర్తి ఎల్లమ్మ,రేణుక,రజిత,తదితరలు పాల్గొన్నారు.
మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం26000 వేలు ఇవ్వాలి: సిఐటియు చండూరు మండల కన్వీనర్ జెర్రిపోతుల ధనుంజయ గౌడ్
